నందమూరి హీరో మొదటిసారి అలా చెయ్యబోతున్నాడు!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజా మూవీ నా నువ్వే వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ హీరో ఏం.ఎల్.ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్లుడి ఈ హీరో కొత్త సినిమా మొదలుకాబోతోంది. కెమెరా మెన్ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.
ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నివేదా థామస్, షాలినీ పాండేలను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ సినిమాటోగ్రాఫర్ గా ఉన్న గుహన్ తన కథకు కళ్యాణ్ రామ్ ను ఎంచుకోవడం తో ఈ ఆయన కళ్యాణ్ రామ్ ను ఎలా చుపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ మొదటిసారి థ్రిల్లర్ సినిమా చేయ్యబోతున్నట్లు తెలుస్తోంది. విభిన్న కథాంశం తో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో శాలిని పండే మెయిన్ హీరోయిన్ గా నటించబోతుండగా నివేదా థామస్ ముఖ్య పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











