మొదటిసారి ప్రభాస్ అలా చేస్తున్నాడు, షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడానికి కారణం అదే!
బాహుబలితో నేషనల్ స్టార్గా ప్రభాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో సుజిత్ ద ర్శ క త్వంలో సాహోతో పాటు జిల్ ఫేమ్ రాదాకృష్ణ ద ర్శ క త్వంలో మ రో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులై నుండి ప్రారంభం కానుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో నటించబోతోంది.
ప్రస్తుతం చేస్తున్న తాజా సినిమా 'సాహో'కు పూర్తి భిన్నంగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాదా కృష్ణ సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమా కోసం మే మొదటి వారంలో ముంబైలో వర్క్ షాప్స్ నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాప్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. సినిమా కోసం ప్రభాస్ మొదటిసారి ఇలా చెయ్యబోతున్నాడు.

రాదా కృష్ణ సినిమా కోసం 'సాహో' షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి ఈ వర్క్ షాప్స్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. ఈ సినిమా కొంత భాగం యూరప్ లో చిత్రీకరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











