తొంగి చూడాల్సిన అవసరం లేదు.. RGV 'పవర్ స్టార్'పై ప్రకాష్ రాజ్ కామెంట్స్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలతో హడావుడి చేస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. డీజిటల్ వరల్డ్ లో బిజీబిజీగా ఉంటూ కాంట్రవర్సీ కథలతో జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే ఇటీవల విడుదల అయిన పవర్ స్టార్ సినిమా కారణంగా ఏ స్థాయిలో వివాదాలు చెలరేగాయో అందరికి తెలిసిందే. అయితే ఆ వివాదంపై సీనియర్ టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ స్పందించారు.

 ప్రకాష్ రాజ్ పాజిటివ్ కామెంట్స్

ప్రకాష్ రాజ్ పాజిటివ్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ తరువాత ఎలా ఉన్నారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. కాస్త కామెడిగా చూపిస్తూనే చివరలో పవన్ కళ్యాణ్ పై పాజిటిన్ కామెంట్స్ చేశాడు. వర్మ నటించిన సీన్స్ కూడా ఓ వర్గం వారికి బాగానే నచ్చాయి. ఇక వర్మ చేస్తున్న హడావుడిపై ప్రకాష్ రాజ్ ఇటీవల ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో పాజిటివ్ గానే స్పందించారు.

వర్మ చాలా తెలివిగల వారు

వర్మ చాలా తెలివిగల వారు

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఆయనతో నేను ఎక్కువగా వర్క్ చేసింది లేదు. కానీ పర్సనల్ గా చాలా సార్లు కలిశాను. ఆయనకున్న తెలివి, విజ్ఞానం నిజంగా చాలా గొప్పది. దర్శకుడిగా గ్రేట్. నేను ఆయన పర్సనల్ గా ఏం మాట్లాడారు అనేది చూడను. నాకు ఆయన నుంచి నేర్చుకోవడానికి ఏం ఉంది. ఆయనతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి అని మాత్రం ఆలోచిస్తాను.

నచ్చకపోతే ఆయనను వదిలేయవచ్చు

నచ్చకపోతే ఆయనను వదిలేయవచ్చు

రామ్ గోపాల్ వర్మ చెడ్డవాడు కాదు. అలాగని అందరిలాంటి వ్యక్తి కాదు. ఒక విచిత్రమైన వ్యక్తి. పవర్ స్టార్ సినిమాతో ఆయన ఎదో చెప్పాలని అనుకున్నారు. సినిమాలో చివరలో మంచిగానే చూపించారని చాలా మంది అన్నారు. ఎవరికైనా వారి భావాన్ని తెలిపే హక్కు ఉంది. నచ్చకపోతే ఆయనను వదిలేయవచ్చు. మనం బలవంతంగా తొంగి చూడాల్సిన అవసరం లేదు. కానీ అతను లిమిట్స్ లో ఉంటాడు అని అనుకుంటున్నాను

Recommended Video

Chitram X Movie Trailer | Latest Movie Trailers
 పవర్ స్టార్ రేంజ్ తగ్గదు.

పవర్ స్టార్ రేంజ్ తగ్గదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమిటో మనకు తెలుసు. ఒక రామ్ గోపాల్ వర్మ తప్పుగా చూపించినా లేకపోతే మరొకరు ఇంకేదో అన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ రేంజ్ అయితే ఏ మాత్రం తగ్గదు. రామ్ గోపాల్ వర్మను అలా వదిలేయండి. పవన్ ఫ్యాన్స్ కూడా వర్మపై సినిమా తీస్తున్నారని విన్నాను. మంచిదే. అలాంటి పోటి ఉండడం నిజంగా మంచిదే. అయితే వర్మ లిమిట్స్ దాటినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది అని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X