‘ఎన్టీఆర్ బయోపిక్’ బాలయ్య ఫస్ట్ లుక్; అచ్చు గుద్దినట్లు అదే పోలిక...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో అలాంటి లుక్‌తో దీన్ని వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే బాలయ్యను చూసినట్లు లేదని, ఇందులో ఆయన అచ్చు గుద్దినట్లు పెద్ద ఎన్టీఆర్ పోలికలతో ఉన్నాడని అభిమానులు అంటున్నారు. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య మేకోవర్ అద్భుతంగా ఉందని... ఇక ఎన్టీఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే తెరపై మరో అద్భుతం ఖాయం అనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
Recommended Video


స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో
ప్రేక్షకులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఎన్టీఆర్' సినిమాకు సంబంధించిన ఈ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

దర్శకుడు క్రిష్ స్పెషల్ కేర్
ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన క్రిష్ ప్రతి అంశం గురించి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ పాత్రతో పాటు ఆయన జీవితంలోని సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అవరసమైన మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పాత్రలను కూడా చూపించబోతున్నారు.

బసవతారకం పాత్రలో విద్యా బాలన్
ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా .... ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు. భువనేశ్వరి పాత్రలో మంజిమ మోహన్ నటిస్తున్నట్లు టాక్.

ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు
ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యఘట్టాలు చూపించబోతున్నారు. ఎన్టీఆర్ బాల్యం, సినిమా రంగ ప్రవేశం, ఆ తర్వాత నటుడిగా ఎదిగిన వైనం, రాజకీయ ప్రభంజనం సృష్టించిన విధానం ఇలా పలు ముఖ్య ఘట్టాలను సినిమాలో ఫోకస్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











