బెదిరిస్తున్నాడని సల్మాన్ ఖాన్ పై పోలీస్ కేసు
ముంబయి: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, ఆయన అంగరక్షకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బాంద్రాకు చెందిన మత్స్యకారుల కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఆయన కాటేజీల నుంచి సముద్రం దృశ్యం సరిగ్గా కనపడటం లేదనీ...తక్షణం తమ చేపల పడవలను...వలలను అక్కడి నుంచి తొలగించాలంటూ వారు తమను బెదిరిస్తున్నారనిఆ మత్య్సకారుల కుటుంబం ఆరోపించింది.
తమ సమస్య గురించి 2011 సెప్టెంబరులో...2012 మేనెలలో ఆ తర్వాత డిసెంబరులో బాంద్రా పోలీసు స్టేషన్‌లో మూడు పర్యాయాలు ఫిర్యాదు చేశామని తెలిపింది. అయితే, పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాకుండా కేవలం నాన్-కాగ్నిజిబుల్ నేరంగా మాత్రమే నమోదు చేసుకున్నారని బాధిత మత్య్సకారుడు లారెన్స్ ఫాల్కన్(65) తెలిపారు.
2011లో బాంద్రాలోని చింబాయ్ ప్రాంతంలో సల్మాన్‌ఖాన్ రెండు కాటేజీలను కొనుగోలు చేశారు. అప్పటి నుంచీ సల్మాన్‌ఖాన్ అంగరక్షకుల వేధింపులు మొదలైనాయని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అదనపు పోలీసు కమిషనర్ విశ్వాస్ నాన్‌గ్రే పాటిల్‌కు ఆదివారం లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించారు. ఒక సందర్భంలో సల్మాన్‌ఖాన్ అంగరక్షకులు తమకుటుంబ సభ్యులొకరిపై చేయిచేసుకున్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications












