సమంత సూపర్ హాట్ గా...ట్విట్టర్ లో (ఫోటో)
హైదరాబాద్ : ఆ మధ్యన సమంత అనారోగ్యంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామెను చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె చాలా ఫిట్ గా...అందంగా తయారైంది. ఆ విషయాన్ని ఆమె గుర్తు చేయటానికి అన్నట్లు ట్విట్టర్ లో ఫోటోలు పోస్ట్ చేస్తోంది. షూటింగ్ లొకేషన్ లో సమంత ఫోటోలు తీయించుకుని మరీ ట్వీట్ చేస్తోంది. ప్రస్తుతం వివి వినాయిక్ చిత్రం చేస్తోంది. ఆ మేరకు ఆమె జపాన్ లో ఉంది. ప్రక్క ఫోటోలో ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజ కూడా చూడవచ్చు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టోక్యో లో ఈ సినిమా ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలైనా వినాయక్, బెల్లంకొండ సురేష్ ప్రస్తుతానికి ఏ విషయాలూ బయిట పెట్టడం లేదు. షూటింగ్ సందర్బంగా టోక్యోకి వెళ్లిన సమంత అక్కడ ఇలా ఫోటో దిగింది.

ఈ సినిమాలో సమంత మరియు తమన్నాహీరోయిన్స్. ఇటీవలే సమంత, సాయి శ్రీనివాస్ ల నడుమ ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ వారం చివరి వరకూ ఉంటుందని అంచనా. శ్రీనివాస్ యాక్షన్ సన్నివేశాలలో తన నటన ద్వారా చాలా మంది ప్రముఖుల ప్రశంసలను పొందాడు. వినాయక్ లాంటి డైరెక్టర్ సినిమాతో తెరకు పరిచయంకావడం అతనికి సానుకులాంశమే. చోట కె నాయుడు సినిమాటోగ్రాఫర్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు .
కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు.
ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. అలాగే సమంత ఇప్పటికే బెల్లంకొండ సురేష్ నిర్మాతగా రూపొందిన నందిని రెడ్డి చిత్రంలోనూ హీరోయిన్ గా చేసింది. అలాగే ఎన్టీఆర్ తో చేస్తున్న రభస చిత్రంలోనూ ఆమెనే ఎంపిక చేసారు. ఆ చిత్రం షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











