అమ్మ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. అవే సుశాంత్ చివరి మాటలు అంటూ..

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ విషాదం నుంచి అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు కోలుకోలేకపోతున్నారు. ఊహించని విధంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి పంచుకొంటున్నారు. సుశాంత్ మృతి వార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ఆయన ఫిట్‌నెస్ కోచ్ సమీ అహ్మద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సుశాంత్ గురించి సమీ ఏం చెప్పారంటే..

Recommended Video

Sushant Singh Rajput's Fitness Coach Reveals The Last Conversation Between Them
ఫిట్‌నెస్, వర్కవుట్లపై శ్రద్ద

ఫిట్‌నెస్, వర్కవుట్లపై శ్రద్ద

సుశాంత్‌కు యాక్టింగ్‌పై ఎంత అంకితభావం చూపుతారో.. ఫిట్‌నెస్, వర్కవుట్ల మీద కూడా అంతే శ్రద్ద పెడుతారు. నాకు చాలా కాలంగా సుశాంత్‌తో పరిచయం ఉంది. నాతో మంచితో స్నేహభావంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి మరణ వార్త వినగానే షాక్ తిన్నాను. ఆ వార్త పీడకల అయితే బాగుంటుందనే ఫీలింగ్ కలిగింది అని సమీ పేర్కొన్నారు.

 మరణవార్త వినగానే ఇంటికి వెళ్లా

మరణవార్త వినగానే ఇంటికి వెళ్లా

సుశాంత్ మరణవార్త వినగానే దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాను. వెంటనే బంద్రాలోని ఆయన ఇంటికి వెళ్లాను. అప్పటికే ఆయన మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. చివరి చూపు కూడా చూడలేని పరిస్థితి కలగడంతో బాధతో తిరిగి వచ్చాను అని సమీ ఆహ్మద్ చెప్పారు.

 చివరిసారిగా జూన్ 1న మాట్లాడాను

చివరిసారిగా జూన్ 1న మాట్లాడాను

నా తల్లి క్యాన్సర్‌తో మరణించడంతో సుశాంత్ నాతో చివరిసారిగా జూన్ 1న మాట్లాడారు. అప్పుడు నాకు చెప్పిన మాటలు నాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాయి. నీకు ఎలాంటి అవసరం వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది కలిగినా నాకు ఎలాంటి సంకోచం లేకుండా కాల్ చేయి. నాతో సహాయం పొందడానికి మొహమాటం పడకని ధైర్యం చెప్పారు అని సమీ బాధతో వెల్లడించారు.

తల్లి అంటే చెప్పలేనంత ప్రేమ

తల్లి అంటే చెప్పలేనంత ప్రేమ

తల్లి అంటే సుశాంత్‌కు చెప్పలేనంత గౌరవం, ప్రేమ ఉంటాయి. నా తల్లి మరణం నేపథ్యంలో.. అమ్మ చనిపోతే ఎంత దుర్బరంగా ఉంటుందో నాకు తెలుసు. తండ్రిని, ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. చివరిసారిగా సుశాంత్ నాకు చెప్పిన మాటలు అవే. ఆ తర్వాత నా ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోవడంలో మునిగిపోయాను. ఆ తర్వాత మాట్లాడటానికి వీలు కలగలేదు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది అని సమీ చెప్పారు.

డిప్రెషన్‌కు లోనయ్యారా అంటే

డిప్రెషన్‌కు లోనయ్యారా అంటే

అయితే సుశాంత్ డిప్రెషన్‌కు లోనయ్యారనే విషయం ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించలేదు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతుండే వారు. రియా చక్రవర్తితో బ్రేకప్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఉంటారా అంటే.. నేను ఎప్పడు వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. ఆయన నాతో కూడా పంచుకోలేదు అని సమీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X