ఈ రోజు (జులై 25) తెలుగు ఐదు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అసలు ఈ మధ్య కాలంలో ఇన్ని తెలుగు సినిమాలు ఒకే రోజు విడుదల అవటం జరగలేదు. వాటిల్లో కాస్త చెప్పుకోదగినవి యశోసాగర్, స్నేహ వుల్లాల్ హీరోహీరోయిన్లుగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ప్రేమకథా చిత్రం 'ఉల్లాసంగా ఉత్సాహంగా', శివాజీ, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా రాజా వన్నెంరెడ్డి రూపొందించిన వినోధ చిత్రం 'మా ఆయన చంటిపిల్లాడు' చిత్రాలు. ఇక మాధవన్ ,భావన జంటగా చేసిన తమిళ డబ్బింగ్ చిత్రం ఆర్య MBBS, సుహాన,యశ్వంత్ నటించింన కృషి, తీర్ధ హీరోగా మామిడి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'ఇట్లు నీ వెన్నెల' చిత్రాలు ఈ రోజు రేసులో ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నిటికీ ఒక కామన్ లక్షణం ఉంది. అది యే సినిమాకీ హైపు,క్రేజ్ లేకుండా విడుదల కావటం. మరి ప్రేక్షకులు యే సినిమాకు ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.