ఆగస్టులో ఒకేసారి రాబోతున్న 5 ఆసక్తికరమైన సినిమాలు.. అందరి ఫోకస్ ఆ సినిమాపైనే!

సినిమా ఇండస్ట్రీలో మళ్లీ చాలాకాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇదివరకే విడుదల తేదీలపై నిర్మాతల మధ్య చాలా చర్చలు జరిగాయి. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమైనప్పటికీ కూడా ఇతర కారణాల వలన వాయిదాలు వేసుకోక తప్పలేదు. ఇక ఇప్పుడు ఆగస్టు 15 సందర్భంగా కొన్ని సినిమాలు భారీ స్థాయిలో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

మొత్తంగా ఆగస్టు రెండో వారంలోనే ఐదు సినిమాలు విడుదల కాబోతుండడం విశేషం. ఇక అందులో ఒక సినిమాపై అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాలీవుడ్ లో భారీ అంచనాలతో విడుదలవుతున్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో గీతా ఆర్ట్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆగస్టు 11న హై రేంజ్ లోనే విడుదల చేస్తోంది.

Five interesting upcoming telugu movie in August second week

నాగచైతన్య కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక మరో బాలీవుడ్ సినిమా రక్షాబంధన్ కూడా మెట్రో ఏరియాలో సందడి చేయబోతోంది. ఇక తెలుగులో అయితే అందరి ఫోకస్ ఎక్కువగా కార్తికేయ 2 సినిమా పైనే ఉంది. నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ థ్రిల్లర్ అడ్వెంచర్ సినిమా టీజర్ ఇదివరకే అంచనాలను పెంచేసింది. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ కూడా ఆగస్టు 12వ తేదీన మిగతా సినిమాల నుంచి పోటీ ఉన్నా కూడా విడుదల చేయడానికి సిద్ధమయింది.

ఇక యువ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12వ తేదీన రాబోతోంది. ఐటెం సాంగ్ తోనే ఈ సినిమాకు మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విక్రమ్ నటించిన కోబ్రా సినిమా కూడా దాదాపు అదే వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలతో పాటు బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ నటించిన మొదటి సినిమా స్వాతిముత్యం కూడా ఆగస్టు 13వ తేదీన రాబోతోంది. మరి ఈ సినిమాలన్నిటిలో కూడా ఏ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X