ఐదు మిలియన్లు అలవోకగా.. మహేష్ స్టామినా!
ఇటీవల విడుదలైన భరత్ అనే నేను చిత్రంలోని మొదటి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల, మహేష్ సూపర్ హిట్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన మొదటి పాట సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సాంగ్ 5 మిలియన్ల వ్యూస్ దాటేయడం విశేషం.
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బాబు ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ మనసులోని భావాలకు అనుగుణంగా సందేసాత్మకగా ఈ సాంగ్ ని దేవిశ్రీ కంపోజ్ చేసాడు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. ఐదు మిళియన్లకు పైగా వ్యూస్ మరియు, 2 లక్షలకు పైగా లైకులతో ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. త్వరలో భారీ ఆడియో లాంచ్ కోసం చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











