»   » రంగస్థలం: ఈ 5 కారణాలే సినిమాను ఓ రేంజికి తీసుకెళ్లాయి!

రంగస్థలం: ఈ 5 కారణాలే సినిమాను ఓ రేంజికి తీసుకెళ్లాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rangasthalam Review : Five Reasons Why You Should Watch Rangasthalam

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా 1980ల నాటి బ్యాక్ డ్రాపుతో పూర్తి పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాపై ఇంత పాజిటివ్ బజ్ రావడానికి ఐదు ప్రధాన కారణాలున్నాయి. ఆ 5 కారణాలు ప్రేక్షకుడికి కనెక్ట్ అయి సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేశాయి.

మళ్లీ మన మూలాల్లోకి తీసుకెళ్లింది

మళ్లీ మన మూలాల్లోకి తీసుకెళ్లింది

మనమంతా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ నగరాలు, పట్టణాల్లో సెటిలయ్యాం. అయితే మనలో అధిక శాతం మంది మూలాలు పల్లెటూరి నుండి వచ్చినవే. ఈ పాయింటును ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు సుకుమార్ సఫలం అయ్యాడు. ప్రస్తుతం యాంత్రిక జీవనం గడుపుతున్న చాలా మందికి ఈ చిత్రం ఒక మంచి రిలాక్సేషన్ ఇస్తుంది.సుకుమార్ కాస్టింగ్ అదుర్స్

సుకుమార్ కాస్టింగ్ అదుర్స్

ఇక తాను అనుకున్న కథకు ఎలాంటి యాక్టర్లు కావాలో, ఎవరైతే పర్ఫెక్టుగా సూటవుతారో అనే విషయమై తగినంత కసరత్తు చేసిన సుకుమార్... ఆయా పాత్రలకు 100 శాతం న్యాయం చేయగల యాక్టర్లను ఎంపిక చేసుకున్నారు. రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ. ప్రకాష్..... ఇలా ఎవరికి వారే తమ తమ పాత్రల్లో జీవించారు.


ప్రధాన బలం అదే

ప్రధాన బలం అదే

‘రంగస్థలం' సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోవాల్సిన అంశాల్లో సంగీతం ఒకటి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. చంద్రబోస్ అందించిన సాహిత్యానికి దేవిశ్రీ అద్భుతమైన స్వరాలు సమకూర్చారు.
అద్భుతమైన విజువల్స్

అద్భుతమైన విజువల్స్

రంగస్థలం చిత్రానికి టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేశారు. రాజమండ్రి, పాపికొండల ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరిగింది. ప్రకృతి అందాలను రత్నవేలు ఎంతో అద్భుతంగా చూపించారు. రామ్ చరణ్, సమంత, ఇతర నటీనటులను తన కెమెరా ద్వారా ఎంతో అద్భుతంగా ఫోకస్ చేశారు.
 సినిమా హిట్టవ్వడానికి ప్రధాన కారణం

సినిమా హిట్టవ్వడానికి ప్రధాన కారణం

‘రంగస్థలం' చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడానికి ప్రధానమైన కారణం.... సుకుమార్ రాసుకున్న కథ, దాన్ని ప్రేక్షకులకు చెప్పిన విధానం. సినిమాలో ఎన్ని హంగులు ఉన్నా కథ, స్క్రీన్ ప్లే అనేది సినిమాకు ప్రాణం పోస్తుంది. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్‌కు ఫుల్ మార్క్స్ పడుతున్నాయి.


English summary
Ram Charan and Samantha starrer, Sukumar's directorial ' Rangasthalam', is released Today. With music by Devi Sri Prasad, lyrics by Chandrabose, DOP by Rathnavelu and also starring Aadhi Pinisetty, Anasuya Bharadwaj and Jagapathi Babu in lead roles, the Telugu film is set in the 1980s in a fictional village called 'Rangasthalam'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X