ఈ వీకెండ్ రీలీజ్ అయ్యే మూవీలు ఇవే...

By Bojja Kumar

హైదరాబాద్ : వీకెండ్ రాగానే ఏదో ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈ శుక్రవారం(జూన్ 21) 5 సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మధ్యలో పెద్ద సినిమా విడుదల ఏమీ లేక పోవడంతో చిన్న సినిమాలన్నీ విడుదలకు క్యూ కట్టాయి.

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన 'యాక్షన్' 3డి చిత్రంతో పాటు, రామ్ గోపాల్ కథ-స్క్రీన్ ప్లే అందించిన మూవీ 'సైకో', శివాజీ ప్రధాన పాత్రలో రూపొందిన 'గురుడు', అదే విధంగా 'అనార్కలి' అనే మరో స్మాల్ బడ్జెట్ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.

దీంతో పాటు హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ నటించిన వరల్డ్ వార్ జెడ్ అనే చిత్రం తెలుగులో 'ప్రపంచ యుద్ధం' పేరుతో విడుదలవుతోంది. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను స్లైడ్ షోలో చూడండి.

యాక్షన్ 3డి


అల్లరి నరేష్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 21న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ఇతర ముఖ్య పాత్రదారులు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రం. ఈ చిత్రానికి కెమెరా : సర్వేష్ మురారి, 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

రామ్ గోపాల్ వర్మ ‘సైకో'


రామ్ గోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన చిత్రం ‘సైకో'. కిషోర్ భార్గవ్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. కాలిబ్రే ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వివేకానంద్ అహుజ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిషా కొఠారి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాని సొసైటీలో ఒక మహిళ ఎదుర్కునే పలు సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాని జూన్ 21న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు

'వరల్డ్ వార్ Z'


బ్రాడ్‌పిట్ హీరోగా రూపుదిద్దుకున్న హాలీవుడ్ యాక్షన్ మూవీ 'వరల్డ్ వార్ Z' ఈ నెల 21న విడుదలవుతోంది. 'మాక్స్ బ్రూక్ రాసిన 'వరల్డ్ వార్' నవల ఆధారంగా రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ చిత్రమిది. మార్క్ ఫోర్‌సైర్ ఈ చిత్రానికి దర్శకుడు. మన రాష్ట్రంలో కె.ఎఫ్.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని విడుదల చేస్తోంది. ఈ చిత్రకథ ఏమిటంటే.. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన జెర్రీ లేన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో గడుపుతుంటాడు. ఇలాంటి తరుణంలో ప్రపంచ దేశ ప్రభుత్వాలని, సైనికుల్ని ' జామ్‌బి' అనే వైరస్ పీడిస్తుంటుంది. దాని బారి నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి జెర్నీ తన కుటుంబాన్ని వదిలి ప్రపంచ యాత్రకి బయలుదేరతాడు. ఆ వైరస్ బారి నుంచి ప్రపంచాన్ని అతనెలా రక్షించాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

శివాజీ ‘గురుడు'


శివాజీ, రీతూకౌర్ జంటగా చందన్ మూవీస్ పతాకంపై కిరణ్ దర్శకత్వంలో సీ.డీ.నాగేంద్ర నిర్మించిన చిత్రం ‘గురుడు'. ఈ చిత్రానికి సంగీతం: మంత్ర ఆనంద్, నిర్మాత: సీ.డీ. నాగేంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిరణ్.

అనార్కలి


గౌతమి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓంకార్, గౌరీశర్మ జంటగా రూపొందించిన చిత్రం ‘అనార్కలి'. పి.ఎన్.రాయ్ దర్శకత్వంలో సక్కుబాయి ఈ చిత్రాన్ని నిర్మించారు. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, ప్రభ, దేవిశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వెంకట హనుమ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, పాటలు:ఎం.వి.ఎస్.సుబ్రహ్మణ్యం, ఎడిటింగ్:మోహన్ రామారావు, దర్శకత్వం:పి.ఎన్.రాయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X