Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐదేళ్ల బాహుబలిపై ప్రభాస్ స్పెషల్ పోస్ట్.. నిజంగా మ్యాజిక్ క్రియేట్ చేశారు!
బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఎంతో మందిని ఆకర్షించింది. బాలీవుడ్ కి సైతం దొరకని ప్రశంసలు ఒక తెలుగు సినిమా సొంతం చేసుకోవడం ఒక రికార్డ్ అనే చెప్పాలి. పాన్ ఇండియా అనే పదానికి సరైన అర్థం చెప్పిన బాహుబలి: ద బిగినింగ్ సినిమా వచ్చి నేటికి ఐదేళ్లు అవుతోంది.2015 జులై 10న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
అయితే అభిమానులు ఈ వేడుకను ఎంతో సంతోషంగా సోషల్ మీడియా ద్వారా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. బాహుబలికి సంబంధించిన ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ కూడా అభిమానులతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. టీమ్ నిజంగా మ్యాజిక్ క్రియేట్ చేసిందని, ఐదేళ్ల బాహుబలి విజయాన్ని సెలబ్రెట్ చేసుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు ప్రభాస్.
నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్న బాహుబలి పార్ట్ 1 ప్రపంచం వ్యాప్తంగా 680కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి స్థాయి కూడా ఈ సినిమాతో ఒక్కసారిగా పెరిగిపోయింది. అనంతరం బాహుబలి సెకండ్ పార్ట్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొత్తంగా బాహుబలి సినిమా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసుకుంది. ఎన్నేళ్ళయినా సినిమా జ్ఞాపకాలు అలానే ఉంటాయని చెప్పవచ్చు.