twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదం , కేసు : ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ధియోటర్ లోకి వెళ్లి ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీల చించివేత

    నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం ఫ్లెక్లీలు కడపలో చింపటం వివాదాస్పదమైంది.

    By Srikanya
    |

    కడప: బాలకృష్ణ నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' రిలీజయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం చూసిన ప్రముఖులు పలువురు క్రిష్‌ పైన, బాలకృష్ణపైన ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఊహించని సంఘటన మాత్రం కడపలో జరిగింది. కొందరు ఈ చిత్రం ఫ్లెక్సీలను చింపేసారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఫ్లెక్సీలను పులివెందులలో గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. నంద మూరి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక లక్ష్మి థియేటర్‌లో గురువారం నుంచి గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం ప్రదర్శిస్తున్నారు. అర్ధరాత్రి సెకండ్‌ షో సినిమా ముగిసిన అనంతరం 1గంటకు గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్‌లోకి చొరబడ్డారు. నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇష్టమొచ్చినట్లు చింపేశారు. ఉదయం 7 గంటల కల్లా ఈ విషయం పట్టణంలో దావాలనంలా వ్యాపించింది.

    Flexed of Gauthami Putra Satakarni has been demolished

    వెంటనే నందమూరి ఫ్యాన్స సభ్యులు మహేష్‌, విజయ్‌కుమార్‌ రెడ్డి, యువకులు థియేటర్‌ వద్దకు తరలివచ్చారు. చింపిన ఫ్లెక్సీలను పరిశీలించి అక్కడి నుంచి ఏఎస్పీ అన్బురాజన్ ను కలిసి జరిగిన విషయాన్ని వివరించి కేసు నమోదు చేసి ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

    స్పందించిన ఏఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని దీనిపై ప్రత్యేకంగా విచారణ సాగిస్తున్నామన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఫుటేజీల్లో చిత్రం సరిగా కనిపించ కపోవడంతో వీటిని హైదరాబాద్‌కు పంపిస్తున్నామన్నారు. ఈ విషయమై చుట్టుపక్కల వారిని విచారిస్తామన్నారు. థియేటర్ల యజమానులు రిలీజ్‌ అయిన సినిమాల విష యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

    వాచమెన్ ను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం అర్బన సీఐ ప్రసాద్‌ను కలిసి వారు వినతిపత్రం అందించారు. ఆయన కూడా ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

    ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలకృష్ణ ఫ్లెక్సీలు చింపడం నీచాతినీచమైన చర్య అని ఎవరు చేశారో అందరికీ బాగా తెలుసని శాసనమండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భాలు పునరావృతమైతే తగి న మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.

    English summary
    Some un Known persons has Demolished the huge Banners, Flexes of Gauythamiputra Sathakarni which were placed near Laxmi Theatre , Pulivendula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X