twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యవసాయానికి బానిసైన ప్లాపు డైరెక్టర్!

    By Bojja Kumar
    |

    నువ్వునేను, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతం అయ్యారు. ఆయన చివరగా తెలుగులో దర్శకత్వం వహించిన రెయిన్ బో, ముగ్గురు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ దర్శకుడు వ్యవసాయానికి బానిసయ్యాడు. వ్యవసాయానికి బానిసవ్వడం ఏమిటి? అదీ ఓ వృత్తేగా....అని అనుకుంటున్నారా? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఈ దర్శకుడు వ్యవసాయం చేస్తున్న మాట నిజమేగానీ, నాగలి పట్టి...పొలంలో దిగి, పాడి పశువులు పెంచుతూ చేయడం లేదు. కంప్యూటర్ ముందు కూర్చొని మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేస్తున్నారు.

    అసలు విషయానికొస్తే....విఎన్ ఆదిత్య ఫేస్‌బుక్‌లో బాగా పాపులర్ అయిన 'ఫార్మ విల్లె' ఆన్‌లైన్ గేమ్‌కు బానిసయ్యాడట. మౌస్ క్లిక్‌లతో వ్యవసాయం చేయడమే ఈ గెమ్ స్పెషాలిటీ. కథా చర్చలు మినహా మిగతా సమయాన్నంతా ఈ గేమ్ ఆడటానికే వృధా చేస్తున్నాడట.

    ప్రస్తుతం ఈ దర్శకుడు 'చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అబ్బాయి', త్రీఇడియట్స్ పేరుతో తెలుగు చిత్రాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు.

    English summary
    Aditya is said to be addicted to 'Farmville', a game that is sensationally popular on Facebook.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X