హిందీలో సూపర్, విజయేంద్రవర్మ
నాగార్జున హీరోగా, ముద్దుగుమ్మలు అనూష్క, ఆయేషా టకియా నటించిన సూపర్ చిత్రం తెలుగులో ఆడలేదు. అలాగే, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన బాలకృష్ణ చిత్రం విజయేంద్రవర్మ కూడా రిలీజ్ అయిందని తెలుసుకునే లోపే థియేటర్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. అయితే, ప్రస్తుతం ఆ రెండు చిత్రాల హిందీ డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సూపర్ చిత్రం - రాబరీ గానూ, విజయేంద్రవర్మ చిత్రం - అర్జున్ - ది వారియర్ అనే నామధేయాలతో హిందీ ప్రేక్షకుల్ని అలరించడానికి ముస్తాబవుతున్నట్టు సమాచారం. అయితే ఇవి విడుదల అవుతాయా లేదా అన్న విషయం అటుంచితే, కనీసం గంటకో సినిమా ప్రసారం చేసే అనేకానేక టీవీ ఛానెల్స్‌కు కొంత సాఫ్ట్‌వేర్‌గా అయినా ఈ చిత్రాలు ఉపయోగపడవచ్చు. ఈ చిత్రాలు డబ్బింగ్ చేయడానికి గల ఉద్దేశం ఆ మాత్రం డబ్బులు ఎందుకు వదులుకోవడం అనేదిగానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications