»   » సెంటిమెంట్ దెబ్బ: చిరు, బాలయ్య, మహేష్... ఇపుడు అఖిల్

సెంటిమెంట్ దెబ్బ: చిరు, బాలయ్య, మహేష్... ఇపుడు అఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన అఖిల్ హీరోగా పరిచయం అవుతున్నాడనే విషయం వినగానే అక్కినేని అభిమానులు సంబర పడ్డాడు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండటంతో మరింత హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ‘అఖిల్' అనే టైటిల్ ఖారారైన తర్వాత అంతా డీలా పడ్డారు. హీరో సొంత పేరు సినిమా టైటిల్ లో ఉండటమే అందుకు కారణం.

గతంలో చిరంజీవి, మహేష్ బాబు, బాలయ్య, నాగార్జున, కళ్యాణ్ రామ్ లాంటి వారిని ఇదే సెంటిమెంటు దెబ్బకొట్టింది. చిరంజీవీ హీరోగా వచ్చిన ‘చిరంజీవి', నాగార్జున హీరోగా వచ్చిన ‘కెప్టెన్ నాగార్జున', మహేష్ బాబు నటించిన ‘మహేష్ ఖలేజా', కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘కళ్యాణ్ రామ్ కత్తి', బాలయ్య నటించిన ‘ఎన్.బి.కె లయన్' లాంటి చిత్రాలు గతంలో బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి.


Flop sentiment hot topic in Tollywood again

పెద్ద పెద్ద స్టార్లను సైతం ఇలాంటి సెంటిమెంటు దెబ్బకొట్టినా.....ఇటు నాగార్జునగానీ, అటు వివి వినాయక్ గానీ, చివరకు నిర్మాతగా డబ్బులు ఖర్చు పెట్టిన నితిన్ గానీ పట్టించుకోలేదు. సెంటిమెంట్ లేదే ఏమీ లేదంటూ లైట్ తీసుకున్నారు. కానీ చివరకు అభిమానులు భయ పడ్డదే జరిగింది. అఖిల్ ను టైటిల్ సెంటిమెంట్ దెబ్బకొట్టింది. అంతా అయిపోయాక ఇపుడు బాధపడి ఏం లాభం!


శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ‘అఖిల్' చిత్రాన్ని నిర్మించారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.'

English summary
Akhil's colossal failure and the disastrous history, this flop sentiment of films with star heroes' names as their titles has become a hot topic in Tollywood once again.
Please Wait while comments are loading...