Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సెక్సీగా ఉన్నా ఆ...అదృష్టం లేని హీరోయిన్ (ఫోటోలు)
హైదరాబాద్ : టాలీవుడ్లో లక్స్ పాపగా పేరొందిన ఆశా శైనీ(ఇప్పడు ఆమె పేరు ఫ్లోరా శైనీ) ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా పరిశ్రమలో నిలదొక్కులేక పోయింది. కారణం ఏదైనా...కనీసం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కూడా రాణించ లేక పోయింది. అడపా దడపా పెద్దగా గుర్తింపులేని చిత్రాల్లో నటిస్తూ.....నేనూ ఈ పరిశ్రమలో ఉన్నాను అంటూ అప్పడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుటుంటోంది.
దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది. సరైన బ్రేక్ రాకపోతే ఏ హీరోయిన్ పరిస్ధితి అయినా ఆఫర్స్ కోసం ఎల్లకాలం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అని నిరూపించిన భామల్లో ఆశాషైనీ కూడా చేరింది.
ఇటీవల రెండు పర్యారాయలు హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఆశా శైనీ...తాజాగా తన సెక్సీ సోకులతో దుమ్ము రేపింది. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఈ కాలం తారల్లో చాలా మంది ఫాలో అవుతున్న పార్ములా అందాలు ఆరబోయడమే. ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన వాళ్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇదే దారిలో ఆశా శైనీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరి లక్స్ పాప లక్ష్యం నెరవేరేది ఎన్నడో..?
స్లైడ్ షోలో ఆశా శైనీకి సంబంధించిన మరిన్ని వివరాలు..
ప్రస్తుతం ఆశా శైనీ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. తెలుగులో రెండు, తమిళంలో రెండు, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది.
ప్రస్తుతం ఆమె తెలుగులో పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్, ఆకాశంలో సగం చిత్రంలో నటిస్తోంది. 'ఆకాశంలో సగం'చిత్రాన్ని 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. యండమూరి వీరేంద్రనాథ్.. అనైతికం నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
తమిళంలో ఆశాశైనీ ‘ఉచకతం', నిజంనిజలగిరతు చిత్రాల్లో నటిస్తోంది.
హిందీలో ఆమె యే రాబ్, లక్ష్మీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈచిత్రాలు ఇంకా నిర్మాణ దశలోనే ఎన్నాయి.
ఆశా శైనీ పరిశ్రమలో తనకు అదృష్టం రావాలని పలు మార్లు తన స్క్రీన్ నేమ్ మార్చుకుంది. ఆశా శైనీగా కలిసి రాకపోవడంతో ఆ మధ్య మయూరిగా మార్చుకుంది. ఇప్పుడు ఆమె పేరు ఫ్లోరా శైనీగా చేంజ్ చేసుకుంది.
దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది.