twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సీగా ఉన్నా ఆ...అదృష్టం లేని హీరోయిన్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్లో లక్స్ పాపగా పేరొందిన ఆశా శైనీ(ఇప్పడు ఆమె పేరు ఫ్లోరా శైనీ) ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా పరిశ్రమలో నిలదొక్కులేక పోయింది. కారణం ఏదైనా...కనీసం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కూడా రాణించ లేక పోయింది. అడపా దడపా పెద్దగా గుర్తింపులేని చిత్రాల్లో నటిస్తూ.....నేనూ ఈ పరిశ్రమలో ఉన్నాను అంటూ అప్పడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుటుంటోంది.

    దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్‌పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది. సరైన బ్రేక్ రాకపోతే ఏ హీరోయిన్ పరిస్ధితి అయినా ఆఫర్స్ కోసం ఎల్లకాలం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అని నిరూపించిన భామల్లో ఆశాషైనీ కూడా చేరింది.

    ఇటీవల రెండు పర్యారాయలు హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఆశా శైనీ...తాజాగా తన సెక్సీ సోకులతో దుమ్ము రేపింది. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఈ కాలం తారల్లో చాలా మంది ఫాలో అవుతున్న పార్ములా అందాలు ఆరబోయడమే. ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన వాళ్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇదే దారిలో ఆశా శైనీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరి లక్స్ పాప లక్ష్యం నెరవేరేది ఎన్నడో..?

    స్లైడ్ షోలో ఆశా శైనీకి సంబంధించిన మరిన్ని వివరాలు..

    ప్రస్తుతం చేతిలో అరడజను చిత్రాలు...

    ప్రస్తుతం ఆశా శైనీ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. తెలుగులో రెండు, తమిళంలో రెండు, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది.

    తెలుగు సినిమాల వివరాలు..

    ప్రస్తుతం ఆమె తెలుగులో పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్, ఆకాశంలో సగం చిత్రంలో నటిస్తోంది. 'ఆకాశంలో సగం'చిత్రాన్ని 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. యండమూరి వీరేంద్రనాథ్.. అనైతికం నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

    తమిళ చిత్రాల వివరాలు..

    తమిళంలో ఆశాశైనీ ‘ఉచకతం', నిజంనిజలగిరతు చిత్రాల్లో నటిస్తోంది.

    హిందీ చిత్రాల వివరాల్లోకి వెళితే...

    హిందీలో ఆమె యే రాబ్, లక్ష్మీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈచిత్రాలు ఇంకా నిర్మాణ దశలోనే ఎన్నాయి.

    పేరు మార్చుకున్నా కలిసి అదృష్టం

    ఆశా శైనీ పరిశ్రమలో తనకు అదృష్టం రావాలని పలు మార్లు తన స్క్రీన్ నేమ్ మార్చుకుంది. ఆశా శైనీగా కలిసి రాకపోవడంతో ఆ మధ్య మయూరిగా మార్చుకుంది. ఇప్పుడు ఆమె పేరు ఫ్లోరా శైనీగా చేంజ్ చేసుకుంది.

    లక్స్ పాపగా పాపులారిటీ...

    దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్‌పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది.

    English summary
    Flora Asha Saini is an Indian film actress and model. She predominantly works in Telugu film industry, but has appeared in a number of Kannada, Tamil and Hindi productions as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X