»   » ఆమె బికినీపైనే ఫోకస్, దర్శకురాలు అసంతృప్తి! (ఫోటోలు)

ఆమె బికినీపైనే ఫోకస్, దర్శకురాలు అసంతృప్తి! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఆయుష్మాన్ ఖురానా, సోమన్ కపూర్ హీరో హీరోయిన్లుగా త్వరలో రాబోతున్న చిత్రం 'బేవకూఫియాన్'. నుపుర్ ఆస్తానా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సోనమ్ కపూర్ హాట్ అండ్ సెక్సీ లుక్‌లో బికినీ ధరించి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఇటీవల ఆమె బికినీ ఫోటోలు విడుదలైనప్పటి నుండీ అందరి దృష్టి అటు వైపే!

అయితే అభిమానులు, ప్రేక్షకులు సినిమాపై కాకుండా, సోనమ్ కపూర్ బికినీ సీన్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతుండటంపై దర్శకురాలు నుపుర్ అస్తానా అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...'జనాలు కేవలం సోనమ్ కపూర్ బికినీ సీన్ల గురించే మాట్లాడుకోవడం నన్ను డిసప్పాయింటింగుకు గురి చేసింది. ఇటీవల విడుదలైన ప్రోమోలో బికినీ సీన్లతో పాటు ఇతర సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రం చూసిన తర్వాత ప్రేక్షకులు ఒక మంచి చిత్రం చూసిన అనుభూతి పొందుతారు' అని తెలిపారు.

కేవలం యువతను ఆకట్టుకునేందుకే బికినీ సీన్లు, కిస్సింగ్ సీన్లు పెట్టలేదని...అవన్నీ కథలో భాగమే అని దర్శకురాలు వెల్లడించారు. రెండు సంవత్సరాలు డేటింగ్ చేసిన జంట మధ్య ఇలాంటివి కామన్‌గా జరుగుతుంటాయి. కథలో భాగంగానే ఆ సీన్లు మిలితమై ఉంటాయి. స్నేహితులతో కలిసి రిసార్టుకు వెళ్లినపుడు సోనమ్ బికినీ వేస్తుందని, అది కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుందని ఆమె తెలిపారు.

బికినీలో సోనమ్ కపూర్ హాట్ లుక్

బికినీలో సోనమ్ కపూర్ హాట్ లుక్


తాజాగా విడుదలైన ‘బేవకూఫియాన్' ట్రైలర్లో సోనమ్ కపూర్ ఇలా గులాబీ రంగు టూ పీస్ బికినీలో హాట్ అండ్ సెక్సీ లుక్‌లో దర్శనమిచ్చింది.

ఆయుష్మాన్-సోనమ్ కపూర్

ఆయుష్మాన్-సోనమ్ కపూర్


స్విమ్మింగ్ ఫూల్‌లో సరసాలు ఆడుతున్న ఆయుష్మాన్ ఖురానా, సోనమ్ కపూర్. తాజాగా విడుదలైన ట్రైలర్లో ఈ సీన్ హైలెట్‌గా ఉంది.

హాట్ రొమాంటిక్ సీన్లు

హాట్ రొమాంటిక్ సీన్లు


సినిమాలో ఇద్దరి మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ఏ రేంజిలో ఉన్నాయో ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

స్పైసీ లుక్‌లో సోనమ్ కపూర్

స్పైసీ లుక్‌లో సోనమ్ కపూర్


స్పీసీ లుక్‌లో కవ్వించే సన్నివేశంలో సోనమ్ కపూర్ ఎంతో సహజంగా నటించింది. సోనమ్ కపూర్ అందాలు చూడటానికైనా యూత్ థియేటర్ల బాట పట్టడం ఖాయం.

ఆయుష్మాన్ ఖురానా

ఆయుష్మాన్ ఖురానా


ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు.

బేవకూఫియాన్

బేవకూఫియాన్


యష్ రాజ్ ఫిలింస్ బేనర్లో ఆదిత్య చోప్రా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నుపుర్ అస్తానా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నటీనటులు

నటీనటులు


సోనమ్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రిషీ కపూర్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


హబీబ్ పైజల్ ఈ చిత్రానికి కథ అందించారు. రఘు దీక్షిత్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 14న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Director Nupur Asthana says she feels disappointed that people are only talking about actress Sonam Kapoor wearing a bikini in her upcoming film. Sonam, 28, has worn a bikini on-screen for the first time in Bewakoofiyaan and it has become the talk of the town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu