ప్రముఖ గాయని దారుణ హత్య.. కారుపై తుపాకీ గుళ్ల వర్షం..
హర్యానాకు చెందిన ప్రముఖ గాయని హర్షితా దహియా తన బావ చేతిలో దారుణ హత్యకు గురవ్వడం సంచలనం రేపింది. ఢిల్లీలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్లు కురిపించి కాల
హర్యానాకు చెందిన ప్రముఖ గాయని హర్షితా దహియా తన బావ చేతిలో దారుణ హత్యకు గురవ్వడం సంచలనం రేపింది. ఢిల్లీలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్లు కురిపించి కాల్చి చంపారు. దహియా తలలో, గొంతులో ఆరు బుల్లెట్లు దిగడంతో సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు.

పానిపట్ కు కారులో వెళుతుంటే
హర్షితా దహియా వయసు 25 సంవత్సరాలు. ఢిల్లీ సమీపంలోని నారెల్లాలో ఓ ప్రదర్శన ఇచ్చిన ఆమె తిరిగి తన ఊరు పానిపట్ కు కారులో వెళుతుంటే ఈ దారుణం చోటుచేసుకొన్నది. ఆమె కారును ఓవర్ టేక్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు.

పలు రౌండ్లు కాల్పులు
హర్షిత ప్రయాణిస్తు్న కారును అగంతకులు ఆపారు. ఆ తర్వాత కారులో ఉన్న మరో ఇద్దరిని వెంటనే కిందకు దిగాలని వారు హెచ్చరించారు. ఆపై అత్యంత సమీపం నుంచి పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆరు బుల్లెట్లు ఆమె శరీరంలో దిగాయి అని చామరా సీనియర్ పోలీస్ ఆఫీసర్ దేష్ రాజ్ తెలిపారు.

చంపుతామని బెదిరిస్తున్నారు
కాగా, తనకు బెదిరింపులు వస్తున్నాయి. చంపుతామని బెదిరిస్తున్నారు అని ఇటీవల హర్షిత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు, వీడియోలు పెట్టిన సంగతి తెలిసిందే.

హర్యానాలో హర్షితా ఫేమస్
రాగిణి సాంగ్స్ పాడుతూ, నృత్యాలు చేసే హర్షితా దహియా అంటే హర్యానాలో ఎంతో ఫేమస్. చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె హత్యకు గురికావడం సంచలనం రేపింది.
నా భర్తే హత్య చేయించాడు..
తన చెల్లెలు హర్షితాను తన భర్త హత్య చేయించాడు. తన తల్లి హత్య కేసులో సాక్ష్యం చెప్పినందుకే తన భర్త ఈ దారుణానికి పూనుకొన్నాడు అని హర్షిత సోదరి లత దహియా ఆరోపణలు చేశారు. గతంలో తన బావ తనపై రేప్ ఒడిగట్టాడని గతంలో హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











