twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సారంగదరియా వివాదం సమాప్తం.. శేఖర్ కమ్ములను కలిసిన కోమలి.. ఆ మాటతో హ్యాపీ!

    |

    రెండు తెలుగు రాష్ట్రాల్లో సారంగ దరియా పాట ఎంతగా వైరల్ అయిందో.. దాని చుట్టూ అల్లుకున్న వివాదం అంతకు మించి హైలెట్ అయింది. తాను సేకరించి పాడిన పాటను తన అనుమతి లేకుండా వాడారని కోమలి, తాను కూడా పాడానని శిరీష.. .జానపదాలు ఒకరి సొత్తు కావని సుద్దాల అశోక్ తేజ్ ఇలా వివాదాం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు శేఖర్ కమ్ముల సుదీర్ఘ వివరణ ఇచ్చినా కూడా వివాదాం సద్దుమణగలేదు.

     శేఖర్ కమ్ముల క్లారిటీ..

    శేఖర్ కమ్ముల క్లారిటీ..

    ముందు నుంచి తాను ఇలా తనకు నచ్చిన పాటలను సినిమాలో వాడుకున్నాను అని, అందరికీ రాయల్టీ చెల్లించాను క్రెడిట్స్ కూడా ఇచ్చాను అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు. కోమిలికి కూడా డబ్బులు, క్రెడిట్ ఇస్తామని ఈ వివాదానికి ముగింపు పలకండని శేఖర్ కమ్ముల క్లారిటీగా చెప్పుకొచ్చాడు.

    కానీ కోమలి మాత్రం..

    కానీ కోమలి మాత్రం..

    కానీ కోమలి మాత్రం ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్లింది. మొన్న మోసగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ... కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అక్కడ మోసపోయినా ఇక్కడ గెలిచాను అంటూ కాస్త అతిగా మాట్లాడింది. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    అయితే తాజాగా శేఖర్ కమ్ముల కోమలిని కలిశాడు. సారంగదరియా వివాదంపై చర్చించాడు. ఆమెకు కావాల్సింది ఏంటో అడిగాడు. దీంతో చివరకు ఈ వివాదానికి ముగింపు పెట్టే సారంగ దరియా పాట లవ్ స్టోరి సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేది. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశాన అని కోమలి చెప్పుకొచ్చింది.

    ఎలాంటి అభ్యంతరం లేదు..

    ఎలాంటి అభ్యంతరం లేదు..

    డైరెక్టర్ సురేష్ చొవరతో నేడు దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని కలిశాను. సంతోషంగా ఉంది. ఆయన తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అలాగే 'లవ్ స్టోరి' సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద 'సారంగ దరియా' పాట నాతోనే పాడిస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కోమలి స్పష్టం చేసింది.

     హ్యాపీగా ఫీలయ్యారు..

    హ్యాపీగా ఫీలయ్యారు..

    ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలిని కలవలేకపోయాను. ఇవాళ ముఖాముఖి మాట్లాడుకున్నాం. నేను ఆమెకు మాటిచ్చినట్లు భవిష్యత్ లో నా సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలికి పాట పాడే అవకాశం ఇస్తాను. నేను సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్‌లను నిలబెట్టుకుంటానని చెప్పాను. కోమలి గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నాను అని శేఖర్ కమ్ముల ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేశాడు.

    English summary
    Folk Singer Komali Meets Sekhar kammula about Saranga dariya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X