రేప్ విషయమై నోరు జారి ఇరుక్కున్న సన్నిలియోన్
బాలీవుడ్ సినిమాలతో భారతీయులకూ పరిచయమైన ఆమె ట్విట్టర్‌లో ఈ వివాదాస్పదమైన వ్యాఖ్య చేసింది. 'రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం' (రేప్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ఇట్ ఈజ్ సర్‌ప్రైజ్ సెక్స్) అని ట్వీట్ చేసింది. కాసేపటికే తన తప్పు గ్రహించింది. తన ట్వీట్‌ను తొలగించింది. కానీ, అప్పటికే జరగాల్సినంత ప్రచారం జరిగిపోయింది. వేల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
ప్రస్తుతం మర్డర్ 3 చిత్రం కోసం రెడీ అవుతున్న ఈ భామ బాలీవుడ్ లో హాట్ ఫేవెరెట్ గా మారింది. సన్ని లియోన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆమె ఫోర్న్ స్టార్ ఇమేజ్ ఆమెను వదలటం లేదు. దాంతో ఆమెను తమ సినిమాల్లో చేయటానికి ఓ మాదిరి హీరోలు కూడా ఒప్పుకోవటం లేదు. సన్నిలియోన్ తో చేస్తే తమ సినిమాలకు ప్యామలీ ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. మహేష్ భట్ క్యాంప్, ఏక్తా కపూర్ తప్ప.. సన్నిలియోన్ తో చేసే ధైర్యం చేయటం లేదు. అయితే తాను బాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికే వచ్చానని సన్ని చెప్పటం విశేషం.
'జిస్మ్-2' చిత్రంతో పరిచయమైన ఈ ఫోర్న్ స్టార్.. అందచందాల ప్రదర్శనతో బాలీవుడ్ వేడిక్కిపోయింది. నటనకన్నా ఆమె శరీరంపైనే కెమెరాల దృష్టి. అది గమనించిన ఈ ముద్దుగుమ్మ ఇలా తను కేవలం ఫోర్న్ స్టార్ ని కాదు భారతీయ సంస్కృతిలో కూడా కలిసిపోగలని చెప్తోంది. తానేమీ వ్యభిచారిని కాదని, ఫోర్న్ స్టార్ అంటే అర్దం వ్యభిచారం చేసే వాళ్లు కాదని సన్నిలియోన్ మీడియా వాపోతోంది. ఆమెను జనం తప్పు పడుతున్నారని, ఇక్కడు ఇండియాలో తనను సరిగా అర్దం చేసుకోకుండా మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె అంటోంది.


Click it and Unblock the Notifications












