»   » ఫోర్బ్స్ జాబితా: హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్

ఫోర్బ్స్ జాబితా: హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ ఫోర్బ్స్ ఇండియా మేగజైన్....తాజాగా ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే సినీ తారల జాబితా విడుదల చేసింది. టాప్ 100 లిస్టులో బాలీవుడ్ స్టార్లతో పాటు పలువురు టాలీవుడ్, తారలు కోలీవుడ్ తారలు చోటు దక్కించుకున్నారు.

బాలీవుడ్ నుండి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల లిస్టులో టాప్ ప్లేసులో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ ఉండగా....టాలీవుడ్లో అత్యదిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా పవన్ కళ్యాణ్‌ పేరు టాప్ పొజిషన్లో ఉంది. ఇక తమిళంలో రజనీకాంత్ పేరు టాప్‌లో ఉంది.

ఫోర్బ్స్ ఇండియా జాబితా ప్రకారం తెలుగు, తమిళంలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయాలు స్లైడ్ షోలో...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు రూ. 23 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

మహేష్ బాబు

మహేష్ బాబు


ఇక టాలీవుడ్ నుండి మహేష్ బాబు సెకండ్ ప్లేసులో ఉన్నారు. మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ. 21 కోట్లు తీసుకుంటున్నాడట.

రామ్ చరణ్ తేజ్..

రామ్ చరణ్ తేజ్..


మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగ్రేటం చేసి అనతి కాలంలో తెలుగు స్టార్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ తేజ్ రూ. 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


ఇక స్టైలిష్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు అన్ని కలిపి రూ. 17 కోట్లు తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


ఇక టాప్ 5లో చోటు దక్కించుకున్న జూ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 15 కోట్లు తీసుకుంటున్నాడట.

రజనీకాంత్

రజనీకాంత్


ఇక తమిళ హీరో రజనీకాంత్ అత్యధికంగా రూ. 32 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ జాబితాలో ఉంది.

విజయ్

విజయ్


తమిళ స్టార్ హీరో విజయ్ రూ. 22 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

సూర్య

సూర్య


తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లు తీసుకుంటున్నాడు.

అజిత్

అజిత్


తమిళ హీరో అజిత్ ఒక్కో సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుంటున్నాడట.

విక్రమ్

విక్రమ్


మరో తమిళ హీరో విక్రమ్ ఒక్కో సినిమాకు రూ. 17 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

English summary

 Forbes India once again announced the list of highest paid across India. The popular magazine also prepared “celebrity 100″ list based on their earnings and remuneration. Several south Indian film celebrities have also made it to the “celebrity 100″ list this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu