హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్స్ వీరే..... (టాప్ 10 లిస్ట్)
ఫోర్బ్స్ బాలీవుడ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్ల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్టులో షారుక్ 243 కోట్ల సంపాదనతో ముందున్నాడు.
ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ 'ఫోర్బ్స్' బాలీవుడ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్స్ వివరాలు విడుదల చేసింది. జూన్ 1, 2016 నుండి జూన్ 1, 2017 మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్లు ఎంత సంపాదించారు అనే వివరాలతో ఈ జాబితా రిలీజ్ చేసింది.
సంవత్సర కాలంగా వారు ఏయే సినిమాలు చేశారు, సినిమాల ద్వారా ఎంత సంపాదించారు, ఇతర మార్గాల ద్వారా ఎంత సంపాదించారు అనే వివరాలు సేకరించి, టాప్ 10లో ఉన్న స్టార్లు ఎవరు? ఎంత మంది హీరోలు ఉన్నారు? ఎంత మంది హీరోయిన్లు ఉన్నారు? అనే విషయాలు రిలీజ్ చేశారు.

10వ స్థానంలో రణబీర్ కపూర్
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ టాప్ 10 జాబితాలో అందరికంటే చివరిలో ఉన్నాడు. ఇతగాడి సంపాదన సంవత్సర కాలంలో రూ. 54 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

9వ స్థానంలో అమితాబ్
వయసు పైబడినా తనలో సత్తా తగ్గిపోలేదంటూ వరుస సినిమాలు చేస్తున్న అమితాబ్ బచ్చన్ సంపాదనలో 9వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపాదన రూ. 57 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

8వ స్థానంలో ప్రియాంక చోప్రా
బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తున్న ప్రియాంక చోప్రా సంపాదనలో 8వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఈవిడగారి సంపాదన రూ. 64 కోట్లుగా పేర్కొన్నారు.

7వ స్థానంలో రణవీర్
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ సంపాదన కూడా 64 కోట్లే. అయితే ప్రియాంక చోప్రాతో పోలిస్తే లక్షల్లో తేడా ఉండటంతో ఆమె కంటే ఒక స్థానం ముందున్నాడు.

6వ స్థానంలో దీపిక పదుకోన్
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్..... టాప్ 10 జాబితాలో 6వ స్థానంలో ఉంది. సంపాదన రూ. 70 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

5వ స్థానంలో హృతిక్ రోషన్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు. ఇతగాడి సంపాదన రూ. 73.6 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

4వ స్థానంలో అమీర్ ఖాన్
బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన అమీర్ ఖాన్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. అమీర్ ఖాన్ సంపాద రూ. 80 కోట్లుగా ఉన్నట్లు పోర్బ్స్ పత్రిక పేర్కొంది.

3వ స్థానంలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన అక్షయ్ కుమార్ ఈ ఏడాది భారీగా సంపాదించాడు. అతడి సంపాదన రూ. 224 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

2వ స్థానంలో సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సంపాదనలోనూ టాప్ లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ఈ ఏడాది సంపాదన రూ. 236 కోట్లు.

1వ స్థానంలో షారుక్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అందరికంటే ఎక్కువ సంపాదనతో ముందున్నాడు. ఈ ఏడాది షారుక్ సంపాదన రూ. 243 కోట్లు.


Click it and Unblock the Notifications











