twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా గ్లామర్ చూసి షాకయ్యారు : డిస్క్ పంక్షన్లో నాగార్జున

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : నాగార్జున-నయనతార జంటగా దశరత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గ్రీకువీరుడు' చిత్రం ఆడియో సూపర్ హిట్టయిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించారు. ఆడియో విజయ వంతం అయినట్లే సినిమాను కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు యూనిట్ సభ్యులు.

    నాగార్జున మాట్లాడుతూ....'తమన్ అందించిన సంగీతం హిట్టయింది కాబట్టే సినిమా విడుదలకు ముందే మంచి హైప్ వచ్చింది. ఈ సినిమాలో నవ మన్మధుడిలా, స్టైలిష్ గా ఉన్నారని అంతా అంటున్నారు. నేను ఇలా కనపడటం వెనక మేకప్ మేన్, కెమెరామెన్ పనితనం ఎంతో ఉంది' అన్నారు.

    'షూటింగులో భాగంగా ఓ సారి రష్యన్ అమ్మాయిలతో పాట చిత్రీకరణ చేస్తుంటే వారు నా వయసు 32 మాత్రమే అనుకున్నారు. కానీ 52 అని చెప్పేసరికి అంతా షాకయ్యారు. సినిమా షూటింగ్ సమయంలో నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది. మే 3వ తేదీన సినిమా విడుదలవుతోంది. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో నా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది' అన్నారు.

    గ్రీకు వీరుడు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ దృశ్య మాలిక

    రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ...శివమని, కింగ్ తర్వాత ఈ సినిమాకు పని చేసాను. ఇలాంటి సినిమాలో నేను కూడా ఓ పార్ట్ అయినందుకు ఆనందంగా ఉందన్నారు.

    గ్రీకు వీరుడు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ దృశ్య మాలిక

    ఈ గ్రీకు వీరుడు రాజ్యాన్ని గెలిచేవాడు కాదు, మనసులను గెలుచుకుంటాడు. ఆయన లాగే ఆయన సినిమాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దర్శకుడు తన సినిమాల్లో ఫ్యామిలీ రిలేషన్స్ బాగా చూపెడుతారు. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా నచ్చుతుందని కోన వెంకట్ తెలిపారు.

    గ్రీకు వీరుడు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ దృశ్య మాలిక

    నిర్మాత శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...నాగార్జునతో విక్కీదాదా చేసినప్పటి నుంచి మా ప్రతి ఆడియో సూపర్ హిట్టయింది. అలాగే ఈ సినిమా ఆడియో కూడా హిట్టయిందన్నారు.

    గ్రీకు వీరుడు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ దృశ్య మాలిక

    నాగార్జున అభిమానులు సినిమా ఎలా ఉండాలని కోరుకుంటారో అలాగే ఉంది. సినిమాలో ఆయన స్టైల్, లుక్ సరికొత్తగా ఉంటాయి. రగడ తర్వాత తమన్ మా బేనర్లో మంచి సినిమా చేసారు' అని వ్యాఖ్యానించారు.

    గ్రీకు వీరుడు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ దృశ్య మాలిక

    దర్శకుడు మాట్లాడుతూ సినిమా ఫస్ట్ కాపీ చూసాం. మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం కుదిరింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నాగార్జునకు, శివప్రసాద్ కు కృతజ్ఞతలు అన్నారు.

    English summary
    “There was a song sequence in the film where I had to dance with some Russian women. After a few days of shoot, they came to know about my age and they expressed their shock. They came up to me and complimented me, saying that I look like a 32 year old guy. That was quite memorable”, said Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X