నటి హేమశ్రీ హత్యకేసు...ఫోరెన్సిక్ నివేదికలో
అక్టోబరు 9వ తేదీన హేమాశ్రీ అనుమానాస్పద రీతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. నివేదికను అందుకున్న తరువాత హేమాశ్రీ కచ్చితంగా ఎన్నిగంటలకు హత్యకు గురైంది? ఎంత పరిమాణంలో క్లోరోఫాంను ఉపయోగించారు? అనే విషయాలపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని హెబ్బాళ పోలీసులు విక్టోరియా ఆసుపత్రి వైద్య నిపుణుల్ని కోరారు. హత్యకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న హేమాశ్రీ భర్త సురేంద్ర బాబు బెంగలూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.
కన్నడ నటి హేమాశ్రీ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నీరుగార్చేందుకు కేసును అనంతపురం జిల్లాకు మార్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఓ మంత్రిగారి కోరిక తీర్చేందుకు ఒప్పుకోలేదని హేమాశ్రీని హతమార్చినట్టు సమాచారం. క్లోరోఫామ్ అధికమవడంతో ఆమె చనిపోయిందని తెలుస్తోంది. అనంతపురంలోని మూడో డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మురళీధర్ కుమార్తె పుట్టిన రోజు ఈ నెల 8న జరిగింది.
ఈ వేడుకలకు నటి హేమాశ్రీని ఆహ్వానించి ఓ మంత్రి కోరిక తీర్చి, ప్రతిఫలంగా ఓ కీలకమైన పని చేయించుకోవాలని మురళి, అతడి సమీప బంధువైన మరో మాజీ కార్పొరేటర్ ప్లాన్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హేమాశ్రీ భర్త సురేంద్రబాబుతో ఉన్న పాత పరిచయాలతో ఆమెను బర్త్‌డే వేడుకకు ఆహ్వానించడంతో హేమాశ్రీ సురేంద్రబాబు ఎనిమిదో తేదీ సాయంత్రం అనంతపురంలో మురళీధర్ ఇంటికి చేరుకున్నారు.
అర్ధరాత్రి వేడుకలు ముగిశాక వారికి రెడ్డిపల్లి ఫామ్‌హౌస్‌లో బస ఏర్పాటు చేసినట్లు చెప్పి అక్కడికి పంపారు. సురేంద్రబాబుతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఓ మంత్రి కోరిక తీర్చేందుకు వెళ్లాలని హేమాశ్రీని డిమాండ్ చేశారని విశ్వసనీయ సమాచారం. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో...క్లోరోఫామ్ ప్రయోగించారు. మోతాదు ఎక్కువై ఆమె మరణించింది.


Click it and Unblock the Notifications












