HBD Nandamuri Balakrishna సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ స్పెషల్ విషెస్.. బాలయ్య క్రేజ్ మామూలుగా లేదుగా
నందమూరి బాలకృష్ణ ఇమేజ్ అంటే తెలుగు రాష్ట్రాలలో చాలా గొప్పగా కనిపిస్తుంది. గట్టిగా చూసుకుంటే సౌత్ ఇండియా వరకు సౌండ్ వినిపిస్తుంది. నార్త్ లో పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చని అనుకుంటారు. అయితే నందమూరి నటసింహం బాలయ్య ఇమేజ్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ యాక్టివిటీస్ ద్వారా చాలా మందికి తెలుసు.
దీనికి కారణం బాలయ్య బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఎంతో మంది క్యాన్సర్ రోగులకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పేదల నుంచి ధనుకుల వరకు క్యాన్సర్ బారిన పడిన చాలా మంది ఈ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తెసుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే బాలయ్య ఇమేజ్ అనేది దేశ వ్యాప్తంగా చాలా మందికి తెలుస్తోంది. తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది విశేష్ చేశారు.

ఇండియన్ మాజీ స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ కూడా ట్విట్టర్ ద్వారా బాలకృష్ణకి విషెస్ చెప్పడం విశేషం. బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సమాజంలో క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ తో ఎంతో మంది ఉపశమనం కలిగించడంతో పాటుగా సమాజంలో ఒక మార్పు చూడాలనే అంకితభావంతో పని చేస్తున్నారు. అది ఏంటో మందికి స్పూర్తిదాయకం అని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక ఈ ట్వీట్ కి గతంలో యువరాజ్ సింగ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి వచ్చి సందరించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోని షేర్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ ఒక సినీ నటుడు, రాజకీయ నాయకుడి గానే కాకుండా సమాజంలో ఎంతో మంది క్యాన్సర్ రోగుల పాలిట దైవంగా ఉన్నాడని, అందుకే యువరాజ్ సింగ్ లాంటి స్టార్ క్రికెటర్ సైతం బాలయ్యకి విషెస్ చెప్పారు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బాలయ్యకి బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే భగవంత్ కేసరి టీజర్ ని కూడా పంచుకొని అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అలాగే సినీ ప్రముఖులు ఎంతో మంది ప్రత్యేకంగా బాలయ్యకి బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం.


Click it and Unblock the Notifications











