నన్ను హత్య చేయబోయాడు.. బిగ్‌బాస్ సెలబ్రిటీ కేసు.. భర్త అరెస్ట్!
భార్యపై హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలపై బిగ్‌బాస్ మాజీ సెలబ్రిటీ సోఫియా హయత్ భర్త వ్లాద్ స్టానెస్క్ కటకటాల పాలయ్యాడు. ప్రముఖ మోడల్, నటి సోఫియా భర్త అయిన వ్లాద్‌ను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్ కేసు నమోదుతో పరారీలో ఉన్న వ్లాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు మీడియా ధృవీకరించింది. పోలీసులు తెలిపిన ప్రకారం..

సోఫియా భర్త అరెస్ట్‌పై మీడియా
సోఫియా హయత్ భర్త వ్లాద్ అరెస్ట్ అయ్యాడు. కొద్దిగంటల క్రితం పోలీసులు పట్టుకొన్నారు. లండన్‌లోని ఫెర్ఫ్యూమ్ షాపులో ఉండగా అరెస్ట్ చేశాం. అదుపులో ఉన్న అతడిని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నట్టు మీడియా పేర్కొన్నది.

గతంలో అరెస్ట్, శిక్ష
రొమెనియాలో జరిగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యుడనే ఆరోపణలతో గతంలో వ్లాద్ అరెస్ట్ అయ్యాడు. ఆ నేరారోపణలు రుజువు కావడంతో శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం రొమెనియా ప్రభుత్వ నిధులను వాడుకొన్నాడనే ఆరోపణలు కూడా ఇతడిపై ఉన్నాయి.

పెళ్లి చేసుకొని.. విడిపోయిన సోఫియా
రొమెనియాకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వ్లాద్, సోఫియా హయత్ 2017లో ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వ్యక్తిగత విభేదాలు రావడంతో వారిద్దరూ కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడని అతడిపై కేసు నమోదు చేసింది.

చోరీలకు పాల్పడ్డి.. రింగ్
తాను ఇంటిరియర్ డిజైనర్ అని మోసం చేశాడు. డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. రూ.10 లక్షల విలువైన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను 1.5 లక్షలకే విక్రయించాడు అని సోఫియా ఆవేదన వ్యక్తం చేస్తూ వ్లాద్‌పై కేసు నమోదు చేసింది.

వివాదంలో సోఫియా హయత్
మోడల్‌గా రాణిస్తూనే బిగ్‌బాస్7లో సోఫియా హయత్ పాల్గొన్నది. ఆ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో అర్మాన్ కోహ్లీతో గొడవపడి సీజన్ మధ్య నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్నది. 2016లో సన్యాసిగా మారినట్టు ప్రకటించుకొన్నది.


Click it and Unblock the Notifications











