Samantha Ruth Prabhu మూవీలో కాంట్రవర్సీ క్రికెటర్.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు బలైన ఆటగాడు మళ్ళీ అలా!

సమంత రూత్ ప్రభు చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది.. ఒకప్పుడు ఎక్కువగా సౌత్ సినిమాల్లో కనిపించే సమంత ఇప్పుడు మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎక్కువగా ముంబై లోనే ఉంటున్నారు..

ఇక తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తూ సమంత మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సమంత నటిస్తున్న ఒక సినిమాలో గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక క్రికెటర్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు ఆ వివరాల్లోకి వెళితే..

ఎలాంటి సినిమా చేసినా..

ఎలాంటి సినిమా చేసినా..

గ్లామరస్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత రూత్ ప్రభు సౌత్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో కూడా సినిమాలు చేసింది.. సమంత ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా స్టోరీ అయితే ఉంటుంది అని అభిమానుల్లో కూడా ఒక మంచి నమ్మకం ఏర్పడింది.

గ్లామర్ విషయంలో..

గ్లామర్ విషయంలో..

గ్లామర్ విషయంలో కూడా సమంత ఎప్పటికప్పుడు చాలా కొత్తగా ఆకట్టుకుంటోంది.. సోషల్ మీడియాలో ఆమె ఎలాంటి పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. ఇక సమంత ఇటీవల కాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా సమంత చాలా మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది.

ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా

ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా

అంతే కాకుండా సమంత ప్రత్యేకంగా స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించడం విశేషం. ఇటీవల పుష్ప సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా సమంతకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా తనకు సూటయ్యే పాత్రలో సెలెక్ట్ చేసుకోవాలి అని సమంత ఆలోచిస్తోంది.

తమిళ్ సినిమాతో..

తమిళ్ సినిమాతో..

ప్రస్తుతం సమంత విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న 'వాకుల రెండు కాదల్' అనే చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలు పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి.

కాంట్రవర్సీ క్రికెటర్

కాంట్రవర్సీ క్రికెటర్

ఇక ఈ తమిళ సినిమాలో కాంట్రవర్సీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే, శ్రీశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో మహమ్మద్ మోబి అనే పాత్రలో శ్రీశాంత్ నటిస్తున్నాడు. శ్రీశాంత్ బ్లాక్ సూట్ ఏవియేటర్స్‌లో చాలా అందంగా కనిపిస్తున్నాడు.

Recommended Video

Samantha - 'It's All Because Of Bunny' | Filmibeat Telugu
సినిమాల్లో బిజీగా..

సినిమాల్లో బిజీగా..

భారత క్రికెట్ అభిమానులకు శ్రీశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. టీమిండియాలో బ్ఫాస్ట్ బౌలర్ గా కొన్నేళ్ళ క్రితం బాగానే రాణించాడు. అతను 2007, 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కూడా ఉన్నాడు. అయితే తన క్రికెట్ విజయాల కంటే, శ్రీశాంత్ తన వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. 2013 ఐపీఎల్ లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం శ్రీశాంత్ కెరీర్‌ను ఒక్కసారిగా నాశనం చేసింది. ఆ తర్వాత సినిమా, టెలివిజన్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X