»   » తాగి వీరంగం వేసిన పోర్న్ స్టార్ : విమానం లో కుర్చీకి కట్టేసారు

తాగి వీరంగం వేసిన పోర్న్ స్టార్ : విమానం లో కుర్చీకి కట్టేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫుల్లు గా తాగటమే కాకుందా ఆ మత్తులో విమానం ఎక్కి ఇంకా లిక్కర్ కావాలంటూ గొడవ చేసింది. అంతే కాదు మధ్యం ఇవ్వమన్నారని విమాన సిబ్బంది మీదే దాడి చేసింది. ఇక ఆ గోల భరించటం కష్టం కావటం తో ఆమె కుర్చీలోనే ఆమెని కట్టేసి ఉంచారు సిబ్బంది. అంతే కాదు విమానాన్ని మధ్యలోనే దింపేసి పోలీసులకప్పగించారు.

1970ల్లో పోర్న్ సినిమాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హర్లీ మేక్‌బ్రైడ్‌ 'యంగ్ లేడీ చాటర్లీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది. ఆనాటి శృంగార చిత్రాలతో ఎక్కడ లేని క్రేజ్ ని సంపాదించుకుందీ నీలి నటి.

ఆమె "లాండ్ అండ్ ఆర్డర్‌ స్పెషల్ విక్టిమ్స్‌" నటుడు రిచర్డ్‌ బ్లెజర్‌ను పెళ్లాడింది. ఇటీవల తన సోదరుడు చనిపోయివడంతో అతని అంత్యక్రియల్లో పాల్గొనడానికి న్యూయార్క్ వచ్చింది. అనంతరం తిరిగి ఫ్రాన్స్‌కు వెళుతుండగా విమానం ఎక్కడానికి ముందే మద్యాన్ని సేవించిన ఆమె.. ఎక్కిన తర్వాత లిక్కర్‌ కోసం గొడవ చేయడం పెద్ద గలాటానే రేపింది.

Former erotic film actress fined 36,000 Dollars for drunken behavior on flight

పూర్తిగా మద్యం మత్తులో జోగుతూ ఆమె రచ్చరచ్చ చేయడంతో గాలిలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. న్యూయార్క్‌ నుంచి ఫ్రాన్స్ వెళుతున్న బోయింగ్ 777 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న 67 ఏళ్ల హర్లీ మళ్లీ మద్యం ఇవ్వాల్సిందిగా విమానం సిబ్బందిని కోరింది. ఇందుకు వారు నిరాకరించడంతో ఆమె వీరంగం వేసింది. దీంతో ఆమెను విమానం సిబ్బంది కూర్చికి ప్లాస్టిక్‌తో కట్టేసి.. అత్యవసరంగా విమానాన్ని దింపేశారు. విమానంలో గలాటా సృష్టించినందుకు తాజాగా ఆమెకు కోర్టు 19,700 పౌండ్లు (రూ. 18.94 లక్షల) జరిమానా విధించింది.

English summary
Actress Harlee McBride was arrested on Sunday after allegedly disrupting a flight and prompting the pilot to make an unscheduled landing
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu