జాతీయ అవార్డు దక్కించుకున్న సినిమా రీమేక్‌లో మాజీ మిస్ ఇండియా
బాలీవుడ్‌లో గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన 'అంధాధున్'. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. దీంతో ఈ సినిమాను తమ తమ భాషల్లోకి రీమేక్ చేయడానికి ఫిల్మ్ మేకర్లు క్యూ కడుతున్నారు. మిగిలిన పరిశ్రమ సంగతి పక్కన పెడితే ఇప్పటికే ఈ సినిమాను తమిళంలోకి రీమేక్ చేసేస్తున్నారు.
తమిళంలో విడుదలై తెలుగులోనూ ఘన విజయం సాధించిన 'జీన్స్', 'జోడి' చిత్రాల ఫేమ్ ప్రశాంత్ హీరోగా ఈ రీమేక్ రూపొందనుంది. ఇప్పటికే ఈ రీమేక్ హక్కులను ప్రశాంత్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయింది. అయితే, ఇందులో నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇన్ని రోజులు క్లారిటీ రాలేదు. కానీ, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి దక్షిణాదిలో హాట్ టాపిక్ అవుతోంది.

దీనికి కారణం.. ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా అనుకృతి వాస్‌ను తీసుకోవడమే. 2018 సంవత్సరం జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ప్రధమ స్థానంలో నిలిచిందీ తమిళ చిన్నది. తిరుచ్చి జిల్లాకు చెందిన ఈమె 21వ ఏటనే మిస్ ఇండియా కిరిటాన్ని దక్కించుకుని రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత ఎంతో పాపురాటీని సొంతం చేసుకుంది. ఇక, ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈమెకు ఫాలోవర్లు కూడా గణనీయంగా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో ఫోటోలను షేర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











