Just In
- 23 min ago
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఏకంగా రెండు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.!
- 1 hr ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 1 hr ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 2 hrs ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
Don't Miss!
- News
అవి తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా ? సీఎం జగన్ సవాల్
- Automobiles
కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను తిరిగి ఇవ్వనున్న ఉత్తరాఖండ్ రవాణా శాఖ
- Sports
ICC Test rankings: కోహ్లీదే అగ్రస్థానం, బాబర్ అజామ్ తొలిసారి టాప్-10లోకి!
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
జాతీయ అవార్డు దక్కించుకున్న సినిమా రీమేక్‌లో మాజీ మిస్ ఇండియా
బాలీవుడ్లో గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన 'అంధాధున్'. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. దీంతో ఈ సినిమాను తమ తమ భాషల్లోకి రీమేక్ చేయడానికి ఫిల్మ్ మేకర్లు క్యూ కడుతున్నారు. మిగిలిన పరిశ్రమ సంగతి పక్కన పెడితే ఇప్పటికే ఈ సినిమాను తమిళంలోకి రీమేక్ చేసేస్తున్నారు.
తమిళంలో విడుదలై తెలుగులోనూ ఘన విజయం సాధించిన 'జీన్స్', 'జోడి' చిత్రాల ఫేమ్ ప్రశాంత్ హీరోగా ఈ రీమేక్ రూపొందనుంది. ఇప్పటికే ఈ రీమేక్ హక్కులను ప్రశాంత్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయింది. అయితే, ఇందులో నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇన్ని రోజులు క్లారిటీ రాలేదు. కానీ, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి దక్షిణాదిలో హాట్ టాపిక్ అవుతోంది.

దీనికి కారణం.. ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా అనుకృతి వాస్‌ను తీసుకోవడమే. 2018 సంవత్సరం జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ప్రధమ స్థానంలో నిలిచిందీ తమిళ చిన్నది. తిరుచ్చి జిల్లాకు చెందిన ఈమె 21వ ఏటనే మిస్ ఇండియా కిరిటాన్ని దక్కించుకుని రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత ఎంతో పాపురాటీని సొంతం చేసుకుంది. ఇక, ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈమెకు ఫాలోవర్లు కూడా గణనీయంగా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో ఫోటోలను షేర్ చేస్తోంది.