పోర్న్ స్టార్ కొత్త బిజినెస్: ఆ సినిమాలు మానేసి ఇలా సెటిలైపోతుందట
కొంత కాలం క్రితమే ఆమె పోర్న్ ప్రపంచానికి గుడ్ బై చెప్పింది. పోర్న్ వదిలేసిన తరువాత ఎక్కువగా స్పోర్ట్స్ మ్యాచ్ ల గురించి మాట్లాడుతూ.. తన సోషల్ మీడియా పేజీల్లో నానా హంగామా చేయడం స్టార్ట్ చేసింది.
2016లో గూగుల్ లో అందరికంటే ఎక్కువగా సెర్చ్ చేయబడిని పోర్న్ స్టార్ ఎవరంటే.. అరబ్ సంతతికి చెందిన మియా ఖలీఫా అంటూ ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అప్పటికే ఆమె పోర్న్ సినిమాల్లో నటించడం మానేసినా కూడా.. ఆమెకు వరల్డ్ వైడ్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. మియా ఖలీఫా ప్రపంచ వ్యాప్తంగా యువతకు బాగా పరిచయం ఉన్న పేరు. పోర్న్ ప్రపంచాన్ని ఒక ఊపూ ఊపిన శృంగార తార ఈమె. గత కొంత కాలం క్రితమే ఆమె పోర్న్ ప్రపంచానికి గుడ్ బై చెప్పింది.

కొత్త బిజినెస్ ప్రారంభించింది
మిడిల్ ఈస్ట్ లోని లెబనాన్ కు చెందిన ఈమె.. ఒక ముస్లిం అయ్యుండీ పోర్న్ సినిమాల్లో నటిస్తావా అంటూ ఉగ్రవాద సంస్థల నుండి డెత్ వార్నింగులను కూడా ఎదుర్కొంది. అయితే అమెరికాలో స్థిరపడ్డాక ఆమె క్రిస్టియన్ క్రింద మారిపోయింది. మరి పోర్న్ వదిలేసిన తరువాత మియా ఏం చేస్తున్నది అనే సందేహాం మీలో కలిగింది కదా? అందుకు సమాధానం చెబుతున్నదామె. ఒక కొత్త బిజినేస్ ను ప్రారంభించింది మియా ఖలీఫా.

సినిమాలు వదిలేసి
ఇకపోతే పోర్న్ సినిమాలను వదిలేసిన తరువాత.. చాలా ఎక్కువగా స్పోర్ట్స్ మ్యాచ్ ల గురించి మాట్లాడుతూ.. తన సోషల్ మీడియా పేజీల్లో నానా హంగామా చేయడం స్టార్ట్ చేసింది మియా. ఆమెకు బేస్ బాల్.. అమెరికన్ ఫుట్ బాల్ అలాగే ఇతర క్రీడలంటే చాలా ఇష్టమని అదంతా చూస్తే ఎవరికైనా అర్ధమవుతోందనే చెప్పాలి.

కాంప్లెక్స్ న్యూస్
అందుకే ఇప్పుడు ఒక ఛానల్ వారు మియా తాలూకు క్రేజ్ ను.. క్రీడల పట్ల ఆమెకు ఉన్న మక్కువను కలిపి వాడుకోవాలని ఫిక్సయ్యారు. 'కాంప్లెక్స్ న్యూస్' అనే యుట్యూబ్ ఛానల్ లో మరో బాస్కెట్ బాల్ ప్లేయర్ తో కలసి ఇప్పుడు 'ఔట్ ఆఫ్ బౌండ్స్' అనే టాక్ షో వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది మియా.

సన్నీ లియోన్
మొత్తానికి పోర్న్ ప్రపంచం నుండి బయటకొచ్చాక చాలా చేయొచ్చు అని ఆల్రెడీ ఇండియన్ సంతతికి చెందిన కెనెడియన్ వనిత సన్నీ లియోన్ ప్రూవ్ చేస్తే.. ఇప్పుడు అదే తరహాలో మియా కూడా ప్రయాణం చేస్తోంది. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో!!


Click it and Unblock the Notifications











