twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ రాష్ట్రపతి అభ్దుల్ కలాం నటిస్తున్న చిత్రం

    By Srikanya
    |

    మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం త్వరలో మై కలాం హూ (నేను కలాం ని) అనే హిందీ చిత్రంలో నటించనున్నారు. ఆయన నిజ జీవిత పాత్రనే ఈ చిత్రంలో పోషించనున్నారు. భారత దేశంలో యూత్ ని ఉద్దేశించి ఈ చిత్ర కథాంశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ విషయమై ఈ చిత్రంలో నటిస్తున్న గుల్షన్ మీడియాతో మాట్లాడుతూ..కలాంకి ఈ చిత్రం గురించి,అందులో తన పాత్ర గురించి తెలుసు. గెస్ట్ పాత్రలో ఆయన కనిపించటానికి ఒప్పుకోవటం చాలా సంతోషదాయకమైన విషయం. ఇక ఈ చిత్ర కథాంశం కలాం ఎప్పుడూ చెప్పే కలలు కనండి..నెరవేర్చుకోండి అనే వాక్యంపై ఆధారపడి తయారైంది. ఒకానొక సందర్భంలో ఆయన ఉపన్యాసం విన్న ఓ కుర్రాడు ప్రేరణ చెంది ఏం సాధించాడన్న దిశగా కథ నడుస్తుంది. అలాగే ఈ కథ బ్రాక్ గ్రౌండ్ రాజస్ధాన్ నేపధ్యంలో ఏర్పాటైంది. మాధవ్ పాండ్య అనే దర్శకుడు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్మైల్ పౌండేషన్ వారు నిర్మిస్తున్నారు. ఇండో-ప్రెంచ్ సంయుక్త సారధ్యంలో యూనెసెఫ్ వారి ఆద్వర్యంలో రూపొందుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X