కృష్ణంరాజు నిర్మాత సారథ్యం వహిస్తున్న కొత్త చిత్రంలో ప్రభాస్ నటించనున్నారు. అయితే హీరో ప్రభాస్ సరసన నలుగురు హీరోయిన్లు నటింబోతున్నారట... గోపికృష్ణ మూవీస్ పతాకంపై, కృష్ణంరాజు కాంబినేషన్‌లో ప్రభాస్ నటించే తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నలుగురు హీరోయిన్లు నటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇదిలా ఉండగా, హనుమాన్ జంక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎడిటర్ మోహన్ తనయుడు రాజా దర్శకత్వం వహించే కొత్త చిత్రంలోనూ ప్రభాస్ నటించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా, బుజ్జిగాడులో జతకట్టిన అందాల భామ త్రిష నటించబోతుందని సమాచారం.