రుతుపవనాలతో పాటు నాలుగు సినిమాలు
ఈ వేసవిలో చాలా సినిమాలు విడుదలైనప్పటికీ నాలుగు సినిమాలు మంచి హిట్లుగా మిగిలాయి. ఇది గొప్ప విశేషమే. ఇక వర్షాకాలం స్పెసల్స్‌గా అనేక చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో రవితేజ- అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడుపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా జూన్ 23న విడుదల కానుంది. మేఘనా నాయుడు ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. ఈనెల 30న నవదీప్ సీతాకోక చిలుక, నీలకంఠ నందనవనం 120 కి.మీ సినిమాలు విడుదల కానున్నాయి. ఇంకా శివాజీ నటించిన సీతారాముడు, జగపతి బాబు బ్రహ్మాస్త్రం ఈ నెలలోనే విడుదల కావలసి ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు జులై మొదటి వారానికి వాయిదా పడవచ్చు.


Click it and Unblock the Notifications