ఉగాది రోజున నాలుగు సినిమాలు
ఉగాది రోజున ఇద్దరు రాముళ్ళు తెలుగుతెరపై పోటీ పడనున్నారు. వేసవి సెలవులు కావడంతో పెద్ద సినిమాలు విడుదల కాకముందే మార్చి నెల ముగిసిపోతుండగా ఈనెల 30న నాగార్జున శ్రీ రామదాసు, నితిన్ రామ్ విడుదల కానున్నాయి. శ్రీరామదాసు చిత్రానికి ఇప్పటికే మంచి ప్రచారం లభించింది. ఈ సినిమా పాటలు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. విడుదల తేదీ నాడు థియేటర్లలో భద్రాచలం రాముడి ప్రసాదాన్ని పంచాలని కూడా నిర్మాత యోచిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని, సుమన్, స్నేహ నటించారు. సాంకేతికవర్గమంతా అన్నమయ్యకు పనిచేసిన వారే. ఇక నితిన్, జెనీలియా, హృషితా భట్ నటించిన రామ్ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఎన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంగీతం యువన్ శంకర్ రాజా. గతంలో తేజ దర్శకత్వంలో బోల్తా కొట్టిన నితిన్ ఈ సినిమా తన కెరీర్‌కు మళ్ళీ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాడు. బాలాదిత్య, సుహాసిని నటించిన వెరైటీ చిత్రం సుందరానికి తొందరెక్కువ, రుతిక నటించిన శృంగార చిత్రం థ్రిల్ కూడా ఉగాది రోజునే విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications