twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఒక్క క్షణం': ఈ 'నాలుగు' సినిమాపై హైప్ పెంచాయి..

    |

    Recommended Video

    'ఒక్క క్షణం' పై ఇవే హైప్ పెంచాయి..

    బ్యాంకాక్ బీచ్‌లో ఓ టెంట్ వేసుకుని కూర్చొంటే.. సాయంత్రానికల్లా కథ రెడీ చేసేయగలడు దర్శకుడు పూరీ జగన్నాథ్. కథ రాయడంలో ఆయన స్పీడ్ అలాంటిది. కొంతమంది దర్శకులు అలా కాదు.. కొన్ని వాస్తవిక అంశాల ఆధారంగా ఓ చిన్నపాటి రీసెర్చ్ చేసేసి.. దానికి కొంత కాల్పనికతను జోడించి కథ సిద్దం చేస్తారు. 'ఒక్క క్షణం' దర్శకుడు విఐ ఆనంద్ ఈ కోవకు చెందినవారే. ఒక్క క్షణం సినిమాకు మంచి హైప్ రావడానికి ఆయన అందించిన కథ, మేకింగ్ స్టైలే కారణం. నేడు ఆ సినిమా విడుదల సందర్భంగా ఆయన మేకింగ్ స్టైల్ గురించి కొన్ని విశేషాలు..

     ఆనంద్ 'ఒక్క క్షణం' కథ..:

    ఆనంద్ 'ఒక్క క్షణం' కథ..:

    'చాలా ఏళ్లుగా నేను కొన్ని యునిక్ కథలను సిద్దం చేసుకుని ఉన్నాను. అందులో ఒకటి ఒక్క క్షణం. గత తొమ్మిదేళ్లలో జరిగిన కొన్ని అసహజ సంఘటనల నేపథ్యంలో రాసుకున్న నోట్స్, సేకరించిన కొన్ని ఫైల్స్ ఆధారంగా రాసుకున్న కథ ఇది. కేవలం సినిమా చేయాలన్న ఆసక్తితో నేనిదంతా చేయలేదు. ఆ ప్యాషన్, క్యురియాసిటీ వల్ల చేశా. ఒక్క క్షణంలో ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేస్తుందనే నమ్మకం ఉంది'-విఐ ఆనంద్.

    మెగా ఫ్యాన్ వర్సెస్ మెగా హీరో: 2017 ఫైనల్ క్లాష్‌ ఇదే.. ఎవరిది పైచేయి?మెగా ఫ్యాన్ వర్సెస్ మెగా హీరో: 2017 ఫైనల్ క్లాష్‌ ఇదే.. ఎవరిది పైచేయి?

     ఆనంద్ డైరెక్షన్ స్టైల్:

    ఆనంద్ డైరెక్షన్ స్టైల్:

    ఆనంద్ దర్శకత్వ శైలి కూడా చాలా యునిక్ అనే టాక్ ఉంది. అదేంటంటే.. ఆయనెప్పుడూ నటీనటుల్ని ఇలా చెయ్యాలి.. అలా చెయ్యాలి అని ఫోర్స్ చేయడం, ఆదేశించడం ఉండదట. జస్ట్.. పాత్ర ఎలా ప్రవర్తించాలి అన్నది మాత్రం చెప్పి వదిలేస్తారట. ఒకరకంగా నటులకు ఆనంద్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారని తెలుస్తోంది.

     రిస్క్ అనుకోడు..:

    రిస్క్ అనుకోడు..:

    ఒక్క క్షణం సినిమాకు ప్రధాన బలం దర్శకుడు విఐ ఆనంద్. రిస్క్ అని తెలిసినా సరే.. రొటీన్, మూస కథల కన్నా డిఫరెంట్ జానర్ కథలు చేయడానికే ఆయన మొగ్గుచూపుతారు. ఆవిధంగా కథతోనే సినిమాపై ఎటెన్షన్ క్రియేట్ చేయగలడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా!, ఇప్పుడు ఒక్క క్షణం విషయంలోనూ అదే జరిగింది. సైన్స్ ఫిక్షన్ సినిమాలను అమితంగా ఇష్టపడే ఈ దర్శకుడు తాజా చిత్రంతోనూ అదే మ్యాజిక్ చేయాలనుకుంటున్నాడు.

     ప్యూర్‌గా కథ చెప్పాలని..:

    ప్యూర్‌గా కథ చెప్పాలని..:

    'ప్యారలల్ లైఫ్' కాన్సెప్టుతో వస్తున్న 'ఒక్క క్షణం' ఓ ప్రయోగాత్మక చిత్రం అనే చెప్పాలి. టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలంటేనే ఒక రకమైన జంకు ఉన్న పరిస్థితుల్లో.. దర్శకుడు ఆనంద్ అలాంటి కథలతో రావడం సాహసమే అని చెప్పాలి.

    సినిమాలో ఎక్కడా అనవసర సన్నివేశాలను జొప్పించకుండా.. ప్యూర్‌గా కథకు అవసరమైన మేరకే స్క్రీన్ ప్లే అందించారట విఐ ఆనంద్. సినిమాలో ఫైట్స్ కానీ అవనసర డ్రామా కానీ ఉండదనే టాక్ వినిపిస్తోంది.

    English summary
    While many look forward to the film Okka Kshanam with anticipation, we give you four reasons why you should watch it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X