రాంచరణ్ సినిమాలో ఆ నలుగురు ..అంచనాలు పెంచేస్తున్న బోయపాటి!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాల జోరు పెరుగుతోంది. ఇప్పటికే రంగస్థలం చిత్రంలో నటిస్తున్న చెర్రీ.. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి చిత్రానికి కూడా ప్రారంభించేసాడు. ఈ చిత్రానికి బోయపాటి భారీ తారాగణాన్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలోని నటీనటులతోనే అంచనాలు పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్నాడు. మరో హీరో ఈ చిత్రంలో ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video


రామ్ చరణ్ కు అన్నగా యువ హీరో
బోయపాటి చిత్రాలు సాధారణంగా మాస్ ఎలీమెట్స్ తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే బోయపాటి తన కాస్టింగ్ ని సిద్ధం చేసుకుంటాడు. రామ్ చరణ్ సినిమాలో యువ హీరో నవీన్ చంద్ర అన్న పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అన్నగా ఎంపికైన ఆ హీరో
బోయపాటి సినిమాలో కథ పరంగా చరణ్ కు ఇద్దరు అన్నలు ఉంటారట. తమిళ హీరో ప్రశాంత్ చరణ్ ని ఇప్పటికె చెర్రీకి అన్నగా ఎంపిక చేశారు. బోయపాటి సినిమాల్లో కథలు హీరో ఫ్యామిలీ లేదా హీరోయిన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంటాయి.

పెళ్లయ్యాక అలాంటి పాత్రల్లో హోమ్లీ హీరోయిన్
హోమ్లీ హీరోయిన్ గా స్నేహ టాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించింది. వివాహం తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అల్లు అర్జున్ చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో స్నేహ ఉపేంద్ర భార్యగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఈ చిత్రంలో స్నేహ చరణ్ కు వదినగా కనిపించనుంది.

ఉత్కంఠ రేపుతున్న వివేక్ రోల్
సైలిష్ గా కనిపించే హీరో ఆది పినిశెట్టిని సరైనోడు చిత్రం ద్వారా బోయపాటి విలన్ గా మార్చేశాడు. ఇప్పుడు మరో క్రేజీ హీరోని చరణ్ కోసం రంగంలోకి దింపుతున్నాడు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నాడు. వివేక్ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై మెగా అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











