పబ్లిసిటీ కోసం అందాలను తెరగా ఆరబోస్తున్న అనుష్క..
అనుష్క అన్న పేరులోనే ఏదో మహత్యం ఉన్నట్లుంది. తెలుగు, తమిళ భాషల్లో అనుష్క శెట్టి చెలరేగిపోతుంటే.. హిందీలో అనుష్క శర్మ అనే భామ దూసుకుపోతోంది. ఈ ఇద్దరు అనుష్కలది ఒకే రాష్ట్రం కావడం ఇక్కడ గమనార్హం. బెంగుళూరుకు చెందిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమ అందచందాలతో అందరినీఆకట్టుకుంటున్నారు. షారుక్‌ఖాన్ హీరోగా నటించిన 'రబ్ నే బనాది జోడి" చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అనుష్క శర్మ, ఆ తర్వాత 'బద్మాష్ కంపెనీ" అనే చిత్రంలోనూ నటించినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు.
ఏదోరకంగా మీడియా దృష్టినాకర్షించకపోతే కెరీర్ కుంటుపడడం ఖాయమని కాస్తంత ఆలస్యంగా గ్రహించిన అనుష్క శర్మ తను తాజాగా నటించిన 'బ్యాండ్ బాజా బారాత్" చిత్రం కోసం ప్రచారం చేస్తూ.. పనిలో పనిగా తన అందాలు మీడియాకు ఆరబోస్తూ తనకు కూడా వ్యక్తిగత ప్రచారం సంపాదించుకుంటోంది. ఇటీవల హాజరైన ఓ ప్రెస్‌మీట్‌లో అనుష్క ఇలా తన అందాలను ఆరబోసింది..


Click it and Unblock the Notifications











