ఈ సమ్మర్ లోనే 'స్లమ్ డాగ్ మిలియనీర్' హీరోయిన్ పెళ్ళి
'స్లమ్ డాగ్ మిలియనీర్'లో ప్రేమికులుగా నటించిన జంట దేవ్ పటేల్, ఫ్రిదా పింటో లు త్వరలో దంపతులు కాబోతున్నారు. ఈ చిత్రం ఆస్కార్ తో అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన వీరిద్దరూ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. అదే సమయంలో కొన్ని పత్రికల్లో వారిద్దరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలొచ్చాయి. కానీ మేమిద్దరం స్నేహితులమే..ప్రేమా లాంటిదిఏమీ లేవని వారు ఖండించారు. అయితే తాజాగా వారిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకొన్నారు. త్వరలోనే వివాహ ముహూర్తం ఖరారు చేస్తారు. పెళ్లికి అవసరమైన వెడ్డింగ్ కేక్‌ను లాస్ ఏంజెలిస్‌లోని స్వీట్ లేడీ జాన్ బేకరీ నుంచి తెప్పిస్తారని తెలిసింది. ఆ బేకరీకి ఉన్న ప్రత్యేకత ప్రత్యేకత ఏమిటంటే..అదే బేకరీలో వారిద్దరూ తొలుత కలిసి మనసు విప్పి మాట్లాడుకొన్నారు. అందుకే ఆ తీపి గుర్తుగా అక్కడి నుంచి కేకును తీసుకొస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











