గాసిప్స్ వస్తున్నాయంటే... నేను సెలబ్రిటీ అయినట్టే కదా
'స్లమ్‌డాగ్ మిలియనీర్" తర్వాత నాపై గాసిప్స్ రావడం మొదలైంది. నాకు ఎక్కడలేని గర్వం వచ్చేసింది. గాసిప్స్ వస్తున్నాయంటే...నేను సెలబ్రిటీ అయినట్టే కదా అని తెగ ఫీలైపోయాను అంటూ చెప్పుకొచ్చింది ఫ్రిదా పింటో. రీసెంట్ గా ఆమె బాలీవుడ్ సినిమాలంటే ఆసక్తి లేదు..హాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనుకుంటోందంటూ గాసిప్ లు వచ్చాయి.దాంతో ఆమె చాలా హర్ట్ అయ్యానని..ఇన్నాళ్ళూ గాసిప్స్ ని ఎంజాయ్ చేసానని ఇప్పుడు బాధ కలుగుతోందని అంది. అలాగే 'స్లమ్‌డాగ్ మిలియనీర్"లో నాకు పెయిర్‌గా చేసిన దేవ్ పటేల్‌తో నాకు ఎఫైర్ నడుస్తోందని కొన్ని పత్రిలకు రాశాయి. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసేసుకున్నాం అని మరికొన్ని పత్రికలు రాశాయి. వాటిని చదివి ఇద్దరం నవ్వుకున్నాం అంది.


Click it and Unblock the Notifications











