ఆఫర్స్ లేవని మీడియా వద్ద ఏడుపు
ఆస్కార్ విన్నర్ 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో హలీవుడ్ లో సినిమాలు సాధించిన ఇండియన్ అమ్మాయి.. ఫ్రిదా పింటో.ఆమె తాజా చిత్రం 'రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఈ వారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ''బాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావటం లేదు. వచ్చినా ఒకటి ఆరా ఆఫర్స్ వచ్చినా అవి కధలు బాగోటం లేదు.. ఇప్పటి వరకూ విన్న కథల్లో ఏదీ నన్ను ఆకట్టుకోలేదు. సినిమాలేం చేయకపోవడంతో ఇక్కడి ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టరు. నేనేం పెద్ద స్టార్‌ని కాదు కదా'' అని బాధపడుతోంది.అలాగే ...ఇదే పరిస్ధితి కొనసాగితే..ఏదో ఒక రోజు నేనే సొంతంగా ఓ సినిమా తీస్తా. అంతకు ముందే నిర్మాణ రంగం మీద కాస్త అనుభవం సంపాదించాలి. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను'' అని చెప్పుకొచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మొదట ఆమె రచ్చ గెలిచి వచ్చినా ఇంట్లో గెలవలేకపోతోంది. మరి ఆమె భాధ చూసి ఎవరన్నా ఆఫర్ ఇచ్చి ఆమెను ఓదారుస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











