twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ మూల్యమే?: తలపట్టుకున్న 'అజ్ఞాతవాసి' నిర్మాతలు.. జెరోం సల్లే ఆ పని చేస్తే అంతే?

    |

    Recommended Video

    ‘అజ్ఞాతవాసి’ చూసిన ఫ్రెంచి డైరెక్టర్.. ట్విట్టర్లో షాకింగ్ కామెంట్స్ !

    హిట్టు కొడితే ఆకాశానికెత్తేయడం ఎంత సహజమో.. సినిమా ఫట్ అయితే నేలకేసి కొట్టడం కూడా అంతే సహజం. 'అజ్ఞాతవాసి'ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు సినిమాపై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. దాదాపుగా అందరి వేళ్లు త్రివిక్రమ్ వైపే.. దర్శకుడి వల్లే 'అజ్ఞాతవాసి' ఔట్ పుట్ ఇంత దారుణంగా వచ్చిందని విరుచుకుపడుతున్నారు.

    ఇదంతా ఒకెత్తయితే.. నిర్మాతల బాధ వర్ణనాతీతం. ఓవైపు నెగటివ్ టాక్ వాళ్లను నైరాశ్యంలో కూరుకుపోయేలా చేస్తే.. మరోవైపు ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోం సల్లే కూడా లీగల్ చర్యలకు దిగబోతున్నాడట..

    జెరోం సల్లే ట్వీట్:

    లార్గో వించ్ సినిమాకు సంబంధించి టీ-సిరీస్ సొంతం చేసుకున్న హక్కులు ఇండియాకే పరిమితం. ఇప్పుడు అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాబట్టి టీ-సిరిస్‌తో ఒప్పందం మాత్రమే సరిపోదనిపిస్తుంది.

     ముదురోతన్న కాపీ వివాదం:

    ముదురోతన్న కాపీ వివాదం:

    అజ్ఞాతవాసి సినిమా జెరోం సల్లే డైరెక్ట్ చేసిన 'లార్గో వించ్' సినిమాకు కాపీ అన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా జెరోం సల్లేనే స్వయంగా సినిమా చూసి 'అజ్ఞాతవాసి'కి నా సినిమాతో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని తేల్చేశారు.

    అలా సద్దుమణిగించినా?..:

    అలా సద్దుమణిగించినా?..:

    లార్గో వించ్ సినిమా ఇండియా హక్కుల్ని జెరోం సల్లే టీ-సిరీస్ కు అమ్మేశారు. అజ్ఞాతవాసి ఆ సినిమాకు కాపీ అన్న వివాదం బయటకు పొక్కడంతో.. టీ-సిరిస్ లీగల్ చర్యలకు కూడా సిద్దపడినట్లు వార్తలు వచ్చాయి.

    ఇంతలో ఏమైందో ఏమో తెలియదు.. సినిమా విడుదల వేళ ఈ వివాదం ఎందుకునుకున్నారో.. ఏమో గానీ.. టీ-సిరీస్ కు కొంత డబ్బు ముట్టజెప్పి వివాదాన్ని సద్దుమణిగించారన్న ప్రచారం జరుగుతోంది.

     లీగల్ చర్యలకు జెరోం సల్లే సిద్దం?..:

    లీగల్ చర్యలకు జెరోం సల్లే సిద్దం?..:

    వివాదం టీ-సిరీస్‌తో ముగిస్తే 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు ఏ తలనొప్పి ఉండేది కాదు. కానీ ఏకంగా డైరెక్టర్ జెరోం సల్లే సినిమా చూసి.. ఇది కాపీ అని తేల్చేయడంతో నిర్మాతలు తలపట్టుకున్నారు.

    జెరోం సల్లే అక్కడితో ఆగకుండా.. టీ-సిరీస్‌కు అమ్మిన హక్కులు కేవలం ఇండియాకే పరిమితం.. కానీ అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కాబట్టి.. దీనిపై లీగల్ చర్యలకు దిగాలా?.. అనే సంశయాన్ని ఆయన లేవనెత్తినట్లుగా అర్థమవుతోంది.

     భారీ మూల్యం తప్పదా?:

    భారీ మూల్యం తప్పదా?:

    అసలే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలకు ఇప్పుడు జెరోం సల్లే దడ పుట్టిస్తున్నాడు. జెరోం సల్లే గనుక చట్టపరమైన చర్యలకు దిగితే 'అజ్ఞాతవాసి' నిర్మాతలు భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు.

     'కాపీ' పట్టుబడితే కష్టమే:

    'కాపీ' పట్టుబడితే కష్టమే:

    హాలీవుడ్ డైరెక్టర్స్ ఇంత అప్రమత్తంగా ఉంటే తెలుగు దర్శకులకు చాలా కష్టమంటూ సోషల్ మీడియాలోనూ సెటైర్స్ పడుతున్నాయి. కాపీ చేసినా.. అనుమానం రాకుండా చేయాలి కానీ ఇలా పట్టుబడిపోతే కష్టమంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు 'అజ్ఞాతవాసి' నిర్మాతల పరిస్థితి మరింత తీసికట్టుగా తయారైందనే చెప్పాలి.

    English summary
    Even though the makers of Pawan Kalyan's "Agnyaathavaasi" have reportedly settled the 'Copyright' issue with T-Series out of the court in order to get a clearance for the worldwide release today, it seems they will now have to deal with the makers of the original film as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X