ఫ్రెంచ్ పబ్‌లో రామ్ చరణ్ సాంగ్
'రచ్చ' సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ పొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైంది. బద్రీనాథ్ సినిమా అనుకున్న స్థాయిలో ఆడక పోవడంతో...రామ్ చరణ్ తో చేసే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు వివి వినాయక్. ఈ చిత్రం భారీగా విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ చోటాకె.నాయుడు సినిమాకు సరికొత్త లొకేషన్స్ వెతికే పనిలో యూరఫ్ లో సంచరిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం చిత్రానికి సంబంధించిన ఓ పాటను చిత్రీకరించేందుక ఓ ఫ్రెంచి క్లబ్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే తరహలో సినిమా కలర్ ఫుల్ గా వచ్చేందకు మరికొన్ని అద్భుతమైన లొకేషన్స్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇందు కోసం వివి వినాయక్, తమన్ ఊటీలో తిష్ట వేసి పాటలు అద్భుతంగా వచ్చేందుకు కరసరత్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











