»   » అన్యాయం చేసారు: ఫిల్మ్ చాంబర్ వద్ద హీరో నిరాహార దీక్ష

అన్యాయం చేసారు: ఫిల్మ్ చాంబర్ వద్ద హీరో నిరాహార దీక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందనే వాదన చాలా కాలం నుండి వినిపిస్తున్న మాట. దీనిపై గతంలో పలు ఆందోళనలు, ప్రభుత్వ పెద్దలకు విన్నపాలు జరిగినా పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. పరిశ్రమలో ఎక్కువగా పెద్ద నిర్మాతలు, భారీ సంఖ్యలో థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లు, పెద్ద హీరోల ఆధిపత్యమే నడుస్తోంది. దీంతో చిన్న సినిమాలు విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.

పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు తీసిన సినిమాలకు వందల సంఖ్యలో థియేటర్లు లభిస్తాయి... కానీ చిన్న సినిమాలకు పట్టుమని పది థియేటర్లు కూడా దక్కని దుస్థితి. దీంతో వ్యయ ప్రయాసల కోర్చి తెరకెక్కించిన చిన్న సినిమాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి.


తాజాగా ఈ రోజు విడుదలకు సిద్దమైన 'ఫ్రెండ్ రిక్వెస్ట్' సినిమా విషయంలో ఇలాంటి వివాదమే చోటు చేసకుంది. తమకు తొలు 30 థియేటర్లు కేటాయిస్తామని చెప్పిన డిస్ట్రిబ్యూటర్ ఇపుడు కేవలం 3 థియేటర్లే కేటాయించడంతో ఈ రోజు రిలీజ్ కావాల్సిన సినిమా దాదాపు ఆగిపోయింది.


దీక్ష

దీక్ష

థియేటర్ల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఫ్రెండ్ రిక్వెస్ట్ టీమ్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.


ఆదిత్య ఓం

ఆదిత్య ఓం

లాహిరి లాహిరి లాహిరిలో, ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆదిత్యా ఓం హీరోగ మోడ్రన్‌ సినిమా బ్యానర్‌పై ఆదిత్యా ఓం స్వీయ దర్శకత్వంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు.


సోష‌ల్ మీడియా బ్యాక్ డ్రాప్

సోష‌ల్ మీడియా బ్యాక్ డ్రాప్

సోషల్ మీడియావిజ‌య్ వ‌ర్మ పాక‌ల‌పాటి నిర్మాణ భాగ‌స్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సోష‌ల్ మీడియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కించారు.


న్యాయం జరుగుతుందా?

న్యాయం జరుగుతుందా?

తమకు తీరని అన్యాయం జరగడంపై నిరశన దీక్ష చేపట్టిన ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రయూనిట్ సభ్యులకు న్యాయం జరుగుతుందో..లేదో


English summary
Friend Request movie team started hunger strike before Hyderabad Fiom Chamber.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu