అవును..బన్ని(అల్లు అర్జున్)నాకు బావ అవుతాడు..అయినా మేమిద్దరం మంచి ప్రెండ్స్ మి అంటున్నాడు రామ్ చరణ్ తేజ. అలాగే వీళ్ళద్దరూ ఎక్కడికి వెళ్ళినా దాదాపు కలిసే పోతూంటారు. వారి స్నేహం లోని గాఢతను వివరించటానికి ఈ మధ్యే జరిగిన ఓ సంఘటనను వివరించాడు. రీసెంట్ గా అర్జున్ తన కోసం ఓ స్క్రిప్ట్ విన్నాడు. ఆ తర్వాత నా దగ్గరకు పంపాడు. నేనూ విన్నాను...చాలా అద్బుతమనిపించింది. అదే విషయం చెప్పాను. దానికి బన్ని అందుకే నీ దగ్గరకు పంపాను. నువ్వు అయితే ఆ పాత్రకు ఇంకా బాగా న్యాయం చేస్తావు అన్నాడు. అదీ మా స్నేహం..ఒకే ప్రొపెషన్ లో ఉన్నా మా మధ్య ఎటువంటి అసూయలూ లేవు..అంటున్నాడు చరణ్. అలాగే స్నేహం అనేది మ్యూచివల్ గా ఒకరిపై మరొకరు చూపే నమ్మకంపై ఆధారపడి ఉంటుందంటున్నాడు. అంతేగా పర్శనల్ గానూ, ప్రొఫెషనల్ గానూ వేర్వేరుగా ఉన్నప్పుడే బంధాలు ఎక్కువ కాలం నిలుస్తాయంటున్నాడు. నిజమే కదా.