జపాన్‌లో ప్రభాస్ క్రేజ్.. ఘనంగా బర్త్ డే సెలెబ్రేషన్స్.. ప్రభాస్ ఇంటికి జపాన్ అభిమానులు!
Recommended Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. నేటితో ప్రభాస్ 39వ పడిలోకి అడుగుపెట్టాడు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. బాలీవుడ్ హీరోలకు ధీటుగా ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులు జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. ఇదంతా ప్రభాస్ క్రేజ్ కు నిదర్శనం ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ జపాన్ వంటి విదేశాల్లో కూడా ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి.
జపాన్‌లో ప్రభాస్ క్రేజ్
బాహుబలి చిత్రం జపాన్ లో కూడా ఘన విజయం సాధించింది. బాహుబలి చిత్రంతో జపాన్ లో ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జపాన్ లో జరుగుతున్నాయి. భారీగా కేకులు సిద్ధం చేసి, సినిమా హాళ్ళని ప్రభాస్ చిత్ర పటాలతో అలంకరించి బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

జపాన్ నుంచి హైదరాబాద్‌కు
కొంత మంది జపాన్ అభిమానులైతే ఏకంగా ప్రభాస్ కోసం హైదరాబాద్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే సందర్భంగా ప్రభాస్ ని కలుసుకునేందుకు కొంతమంది జపాన్ అభిమానులు ప్రభాస్ నివాసం వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

శుభాకాంక్షల వెల్లువ
సోషల్ మీడియాలో ప్రభాస్ కు అభిమానుల నుంచి, సినీప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రలో అభిమానులు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మేకింగ్ వీడియోతో అదరగొట్టారు
ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మేకింగ్ వీడియోని విడుదల చేశారు. చేజింగ్ సన్నివేశాల్ని హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ లో రూపొందిస్తున్నారు. ప్రభాస్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు.


Click it and Unblock the Notifications











