మేకప్ లేకుండా మన హీరోయిన్స్ ఇంత ఇలా ఉంటారా?...షాకిచ్చే ఫొటోలు-1

By Srikanya

హైదరాబాద్ : హర్రర్ సినిమా తీస్తున్నారా...హీరోయిన్ కు ప్రత్యేకమైన మేకప్ ఎందుకండీ..మేకప్ తీసేస్తే ఆమెను చూసి జనం చచ్చినట్లు భయపడతారు. ఓ రేంజిలో దడుసుకుంటారు కూడా అనే జోక్ ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది.

అయితే నిజంగా అది జోకేనా లేక...మేకప్ లేకుండా అలాగే హీరోయిన్స్ ఉంటారా..అనే సందేహం చాలా మందికి పీకుతూంటుంది. అందుకే సాధ్యమైనంతమంది స్టార్ హీరోయిన్స్ మేకప్ లేకుండా ఎలా ఉంటారో మీకు చూపెట్టాలని ఫిక్సైపోయాం. ఇదిగో ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి మరి.

ముఖ్యంగా ఏ గ్లామర్ ఇండస్ట్రీని తీసుకున్నా.. మన హీరోయిన్స్ ..మేకప్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చే సమస్యే ఉండదు. మేకప్ విషయంలో చాలా అలర్ట్ గా ఉంటారు. కానీ కొందరు మాత్రం అప్పుడప్పుడూ ధైర్యం చేస్తూంటారు. ధైర్యంగా తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేస్తూ ఉంటారు. అలాగే మీడియావాళ్లు కూడా ఎప్పుడు ఈ అందగత్తెలు మేకప్ లేకుండా దొరుకుతారా అన్నట్లు ఎదురుచూస్తూంటారు.

మేకప్ లేని కాజల్

మేకప్ లేని కాజల్

హీరోయిన్ గా ఇంకా వెలుగుతున్న కాజల్...మేకప్ లేకపోతే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది. కళ్లజోడుతో కాస్త ముదురు ఫేస్ తో కనపడుతుంది. అయితే మనం కాజల్ ని మేకప్ లేకపోయినా గుర్తు పట్టచ్చు. కానీ చాలా మంది హీరోయిన్స్ గుర్తుపట్టలేం సుమా.

మేకప్ లేని లక్ష్మి రాయ్

మేకప్ లేని లక్ష్మి రాయ్

మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఐటం సాంగ్ చేసి, ఇప్పుడు అన్నయ్య మెగాస్టార్ 150 వ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తున్న లక్ష్మీ రాయ్..ఇదిగో ఇలా మేకప్ లేకుండా ఉంటుంది. మేకప్ వేస్తే అదేంటో సెక్సీలుక్ ఆమెలో పరుగెత్తుకుంటూ వచ్చేస్తుంది.

మేకప్ లేని నయనతార

మేకప్ లేని నయనతార

కంగారుపడకండి నయనతారే. కాస్త మేకప్ లేని ఫొటో చూస్తున్నారు అంతే. ఏ ఫొటో షాప్ లోనే ఆమెను ఇలా తయారు చేసి అందిస్తున్నాం అని డౌట్ పడతారేమో . అంతలేదు. ఆమె కు మేకప్ లేనప్పుడు తీసిన ఫొటోనే ఇది.

మేకప్ లేని నిత్యా

మేకప్ లేని నిత్యా

మీరు నిత్యా మీనన్ ఫ్యానా. అయితే నా మీద ఖచ్చితంగా ఈ ఫొటో అందిస్తున్నందుకు కోపపడతారు. ఎందుకంటే నిత్యా తెరపై ఎలా ఉంటుందో..దాదాపు అలాగే తెర వెనక మేకప్ లేనప్పుడు కూడా అలాగే ఉంటుంది. కొద్దిగానే తేడా ఉంటుంది.ఎంతైనా నేచరల్ ఆర్టిస్టు కదా.

మేకప్ లేని ప్రణీత

మేకప్ లేని ప్రణీత

అత్తారింటికి దారేదిలో అదరకొట్టిన ప్రణీత ..మేకప్ లేకపోయినా అదరకొడ్తోంది కదూ. సరైన బ్రేక్ రాలేదు కానీ ఇండస్ట్రీని ఏలయ్యిదూ అంటారా. ఈ కన్నడ భామకు కాస్త ఇక్కడ కాన్సర్టేషన్ తక్కువ కానీ బాపు బొమ్మే కదూ.

మేకప్ లేని ప్రియమణి

మేకప్ లేని ప్రియమణి

రీసెంట్ గా వచ్చిన మనవూరి రామాయణం నుంచి అప్పటి యమదొంగ దాకా ప్రియమణి ఒకేలా ఉంది అనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే. పెద్ద తేడా కనపించదు. కాకపోతే ఆమె మేకప్ లేకపోతే మాత్రం కొద్దిగా డిఫెరెంట్ గానే ఉంటుంది. కాకపోతే కళ్లు చూసి గుర్తుపట్టేయచ్చు .

మేకప్ లేని సమంత

మేకప్ లేని సమంత

త్వరలో నాగచైతన్యను చేసుకుని అక్కినేని కుటుంబ కోడలు అవుతున్న సమంత...మేకప్ లేకుండా ఇదిగో ఇలా ఉంటుంది. నిజానికి మేకప్ లేకుండా చాలా బాగుంటుంది అని చాలా మంది అంటూంటారు. మరి మేకప్ లేనప్పుడు చూసే కదా మన చైతూ ప్రేమలో పడ్డాడు.

మమతా మేకప్ లేకపోతే చూడగలమా

మమతా మేకప్ లేకపోతే చూడగలమా

ఆకలేస్తే ..అన్నం పెడితే..అలిసొస్తే ఆయిల్ పెడతా అంటూ శంకర్ దాదా జిందాబాద్ లో పాడిన ఆమె యమదొంగలోనూ హీరోయిన్ పాత్ర చేసింది. తర్వాత ఎన్నో సినిమాలు చేసింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆమె అసలు రూపం ఇదండీ.

మేకప్ వేస్తేనే శృతి

మేకప్ వేస్తేనే శృతి

శృతి హాసన్ రీసెంట్ గా ప్రేమమ్ హిట్ తో చాలా ఉషారుగా ఉంది. మరి ఆమె మెకప్ లేకుండా ఎలా ఉంటుంది .అంటే ఇదిగో ఉంటుంది. అఫ్ కోర్స్ ఆమె మేకప్ లేకపోయినా అందం కొంచెం కూడా తగ్గలేదు అనుకోండి.

మేకప్ అవసరమా స్నేహా ఉల్లాల్

మేకప్ అవసరమా స్నేహా ఉల్లాల్

స్నేహా ఉల్లాల్ అంటే మీకు చాలా సినిమాలు గుర్తు వస్తున్నాయి కదూ. ఈ మధ్యకాలంలో కాస్త హవా తగ్గిన ఈ సుందరి ఐష్ కు డూప్ అన్నారు ఆమెను. ఇంతకీ ఆమె మేకప్ లేకపోతే ఎలా ఉంటుందనేది మీరు పైన చూడండి..కాస్త గమ్మత్తుగా ఉంది కదూ.

ఈ అందానికి మేకప్ ఎందుకు

ఈ అందానికి మేకప్ ఎందుకు

అదేనండీ మన రాధాగోపలం స్నేహ. బాపు బొమ్మలాగ ఉందని అంటారే ఆమే. స్నేహ మేకప్ లేకుండా ఇదిగో ఇలా ఉంటుంది. అయితేనేం ఆ కళ ఎక్కడికిపోతుంది అంటారా.. మీరు ఆమె అబిమాని అయితే ఈ ఫోటోని వదిలేసి వెంటనే వేరే ఫోటోలోకివెళ్లిపోండి.

ముఖానికి కలర్స్ అవసరమే

ముఖానికి కలర్స్ అవసరమే

కలర్స్ స్వాతి..స్వామిరారా చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి త్రిపురతో వెనక్కి వెళ్లిపోయింది. ఆమె మేకప్ లేకుండా ఎలా ఉంటుంది అంటే..ఇదిగో ఇలా ఉంటుందని చెప్పాలి.

బయిటకూడా బాగానే ఉందిగా

బయిటకూడా బాగానే ఉందిగా

కొత్తబంగారు లోకం పాప శ్వేతబసు...ఇదిగో ఇలా మేకప్ లేకుండా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది పాత ఫొటోనే అనుకోండి. కాకపోతే మనం ఆమెను పాత రోజుల్లోనే చూసాం కదా..అంటే కొద్ది సంవత్సరాల క్రితం మన సినిమాల్లో..

తాప్సీని ఈ విషయంలో కొట్టేవాళ్లే లేరు

తాప్సీని ఈ విషయంలో కొట్టేవాళ్లే లేరు

బాలీవుడ్ లో దూసుకుపోతున్న తాప్సీ...మేకప్ లేకుండా కూడా ఎంత కళకళ్లాడిపోతోందో చూడండి. ఈ డిల్లీ భామ అందం ముందు ఎవరైనా దిగదుడిపే అనిపిస్తోంది కదూ. తెలుగుకి బై చెప్పినా ఆమె అప్పడప్పుడూ ఇటు వైపు ఓ లుక్ వేస్తూనే ఉందండోయ్

తమ్ము కు పెద్ద తేడా ఏమీలేదు

తమ్ము కు పెద్ద తేడా ఏమీలేదు

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. రీసెంట్ గా ప్రభుదేవాతో చేసిన అబినేత్రి చిత్రంలో అదరకొట్టింది. ఆమె మేకప్ లేకపోతే ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది. అయితే మేకప్ లేకుండా ఉన్నా పెద్ద తేడా అనిపించదు.

వామ్మో ..త్రిష ...

వామ్మో ..త్రిష ...

మేకప్ లేకుండా త్రిష ని చూస్తూంటే కాస్త డిఫెరెంట్ గానే ఉంది కదూ. కాకపోతే ఆ ఫీచర్స్ ఎక్కడికి పోతాయి. త్రిష మేకప్ లేకపోయినా నవ్విందంటే చెప్పేయచ్చు ఆమె త్రిష అని. అందుకే ఆమె మేకప్ లో లేకపోయినా అందరూ గుర్తు పట్టేస్తారు.

స్వీటి గర్ల్ కు మేకప్ అక్కర్లేదు

స్వీటి గర్ల్ కు మేకప్ అక్కర్లేదు

బాహుబలిలో అనుష్కను చూసినా వారంతా మేకప్ లేకుండా అనుష్కను తీసారు అన్నారు. కానీ నిజానికి ఆమెకు మేకప్ వేసే ఆ సినిమాలో చూపెట్టారు. అనుష్క మేకప్ లేకుండానే స్వీటీగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఏమంటారు

 మంచు లక్ష్మి ఇంటా, బయిటా

మంచు లక్ష్మి ఇంటా, బయిటా

మంచు మోహన్ బాబు వారసరాలిగా తన నటనతో అదరకొడ్తూ, టీవి షోలతో దుమ్ము రేపుతున్న లక్ష్మీ ప్రసన్న..మేకప్ లేకుండా కూడా చాలా కళగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆమె మేకప్ లేకూండానే బయిట ఎక్కువగా కనపడుతూంటుంది.

సూర్య కే మీకు కూడా ఆమెను

సూర్య కే మీకు కూడా ఆమెను

తమిళ స్టార్ హీరో సూర్య బార్య జ్యోతిక తెలుగులో షాక్ చిత్రంతో పరిచయమైంది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఆమె మళ్లీ వెండితెరపై మెరుస్తోంది. ఆమె మేకప్ లేకుండా ఎలా ఉంటుందో కేవలం సూర్యకు మాత్రమే కాదు..ఇప్పుడు ఈ ఫొటోతో మీకు కూడా తెలిసింది.

వితౌట్ మేకప్ ఇలియానా

వితౌట్ మేకప్ ఇలియానా

ఇలియానా అనగానే పోకిరి నుంచి ఆ మధ్యన వచ్చిన దేముడు చేసిన మనుష్యులు దాకా వరస పెట్టి సినిమాలు గుర్తుకు వస్తాయి కదా. ఈ గోవా సుందరి తన నడుముతోనే తెలుగు వారి పల్స్ పట్టేసింది. ఆ తర్వాత ఇప్పుడు హిందీలోనూ వరస సినిమాలు చేస్తూ బిజిగా ఉంటుంది. ఆమె వితౌట్ మేకప్ ఎలా ఉంటుంది అంటే..ఇదిగో ఇలా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X